క్రికెట్ స్టేడియంలో సందడి చేసిన బుల్లితెర నటుడు ప్రభాకర్, కొడుకు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో టీవీ సీరియల్స్ లో నటిస్తూ నిర్మాతగా కూడా మారాడు. ఇక ఇటీవల ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ ని హీరోగా ఇంటర్వ్యూస్ చేయనున్నాడు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో చంద్రహాస్ ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ప్రభాకర్ కొడుకుని నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఈ ట్రోలింగ్ గురించి స్పందించిన ప్రభాకర్ తన కొడుకుని ఇలా రోల్ చేయడం పద్ధతి కాదని దయచేసి ఇలా చేయడం ఆపండి అంటూ నెటిజన్స్ ని వేడుకున్నాడు. ఇలా హీరోగా ఒక సినిమా కూడా పూర్తికాకముందే చంద్రహాస్ మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాద్ లో ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూడటానికి ప్రభాకర్ తన కొడుకుతో సహా స్టేడియంలో సందడి చేశాడు.

ఈ క్రమంలో స్టేడియంలో చంద్రహాస్ జాతీయ పతాకాన్ని పట్టుకొని ఫోటోలకి ఫోజులు ఇచ్చాడు. ఈ ఫోటోలను ప్రభాకర్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దీంతో కొంతమంది నేటిజన్స్ పాజిటివ్గా కామెంట్స్ చేయగా మరి కొంతమంది మాత్రం హీరోగా పనికిరావని చంద్రహాస్ ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు . ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.