ఆమె లేని లోటుతో రోజూ బాధపడుతున్న సుమ…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు సుమ. రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లో యాంకర్ గా రాణిస్తూ బుల్లితెర రానిగా గుర్తింపు పొందిన సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ తో పాటు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్ లు అంటూ నిత్యం బిజీగా ఉండే సుమ ఇటీవల సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించింది. సుమ తన మాటల గారడీతో అందరిని మైమరిపించి తనకి అభిమానులుగా మార్చుకుంటుంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజు తన జీవితంలో జరిగే సంఘటనలను వీడియోల ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది.

సుమ ఇండస్ట్రీలో దాదాపు 20 సంవత్సరాలుగా యాంకర్ గా కొనసాగుతోంది. ఎంతోమంది టాలెంటెడ్ అండ్ గ్లామరస్ యాంకర్లు ఇండస్ట్రీకి వచ్చినా కూడా సుమకి పోటీగా నిలువలేక పోతున్నారు. ఇలా ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండే సుమ జీవితంలో కూడా ఒక తీరని లోటు మిగిలింది కొంతకాలం క్రితం సుమ గారి అత్తమామలు ఇద్దరు కాలం చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే సుమ తన తల్లి తర్వాత తల్లిలా తన అతను ఎంతగానో ఇష్టపడేది వరుస షూటింగ్ లతో నిత్యం బిజీగా ఉండే సుమ ఎప్పుడు బయటకు వెళ్లినా కూడా తన అత్తగారు తన పిల్లలని ఎంతో జాగ్రత్తగా చూసుకునేదని, ఆమె మరణం తర్వాత ఆమె లేని లోటు బాగా తెలుస్తోందని సుమ బాధపడుతున్నట్లు సమాచారం.

సాధారణంగా మనుషులు కానీ వస్తువులు కానీ మన వద్ద ఉన్నప్పుడు మనకి వాటి విలువ తెలియదు. ఎప్పుడైతే అవి మనకు దూరం అవుతాయో అప్పుడే వాటి విలువ మనకు తెలుస్తుంది. సుమ అత్తగారు చనిపోయిన తర్వాత ఆమె లేని లోటు సుమకి బాగా తెలుస్తున్నట్లు సమాచారం. తన అత్తగారు బ్రతికి ఉన్నప్పుడు సుమను ఎంతో ప్రేమగా చూసుకునేదని తన తల్లి ప్రేమను కూడా మరిపించేదని సుమ తన స్నేహితులతో చెప్పుకొని బాధపడినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తన అత్తగారు మరణించిన తర్వాత రోజు ఇంటికి రాగానే ఆమె ఫోటో చూసి సుమ బాధపడుతున్నట్లు ఆమె స్నేహితుల ద్వారా తెలిసింది.