తల్లితో కలిసి ఘనంగా ఓనమ్ పండుగ చేసుకున్న సుమ.. వైరల్ అవుతున్న వీడియో!

యాంకర్ సుమ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఈమె గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె కేవలం బుల్లితెర కార్యక్రమాలకు మాత్రమే కాకుండా సినిమా ఈవెంట్లలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో సుమ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సుమ ప్రతి ఒక్క పండుగకు అలాగే షూటింగులకు తనకు సంబంధించిన అన్ని విషయాలను వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటారు. ఇక ఈ మధ్యకాలంలో సుమ తన వీడియోలలో తన తల్లి గురించి ఎక్కువగా చెబుతూ ఉండడం మనం గమనించవచ్చు.వరలక్ష్మి వ్రతం సందర్భంగా తన తల్లి కోసం ప్రత్యేకంగా చీర కొనుగోలు చేసి తన అపార్ట్మెంట్స్ లో ఉన్న వారందరినీ పిలిచి ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరిపించారు.

ఇకపోతే తాజాగా ఓనమ్ పండుగ సందర్భంగా ఈమె తన తల్లితో కలిసి ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోని ఈ పండుగకు సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది ఇందులో తన భర్త రాజీవ్ కనకాల ఇద్దరు సాంప్రదాయ దుస్తులలో ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. ఇక సుమ కేరళ అమ్మాయి కావడంతో కేరళలో ఓనమ్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలుగు వాళ్లకు ఉగాది పండుగ ఎంత ముఖ్యమో కేరళ వారికి ఓనమ్ అంతే ముఖ్యం కావడంతో ఈ పండుగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.