జబర్దస్త్ పొట్టి నరేష్ నెలకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా కమెడియన్లుగా ఫేమస్ అయిన వారిలో పొట్టి నరేష్ కూడా ఒకరు. చూడటానికి పొట్టిగా ఉన్నా కూడా తనదైన శైలిలో పంచులు సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కమీడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. జబర్దస్త్ షో లో సందర్భానుసారంగా ప్రతివారం రెండు మూడు స్కిట్లలో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటాడు. ఇలా స్కిట్ లలో తన కామెడీ పంచులు, సెటైర్ లు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటు కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు.

ఇలా జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో లతోపాటు ఈటీవీ వారు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో కూడా నరేష్ సందడి చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇలా ఈటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోలో సందడి చేస్తున్న పొట్టి నరేష్ కి మల్లెమాలవారు మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నరేష్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు. తాజాగా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తన జీవితంలో రోజు జరిగే విశేషాలను యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తూ మంచి వ్యూస్ సాధిస్తున్నాడు. ఇలా యూట్యూబ్ ద్వారా కూడా నరేష్ కి మంచి ఆదాయం లభిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా టీవీ షోలు, యూట్యూబ్ వీడియోలు ద్వారా మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతూ కూడా డబ్బు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా నరేష్ నెల తిరిగేసరికి దాదాపు 5 నుండి 6 లక్షల వరకు ఆదాయం అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నరేష్ ఈ స్థాయిలో డబ్బు సంపాదించడానికి ముఖ్య కారణం మాత్రం జబర్దస్త్ అని చెప్పవచ్చు. జబర్ధస్త్ వల్ల వచ్చిన గుర్తింపు తోనే నరేష్ ఇలా పాపులర్ అయ్యి ఇంత మొత్తంలో ఆదాయం పొందుతున్నాడు.