అందుకే సుధీర్ గ్రేట్.. మొత్తానికి చించేశాడు.. వైర‌ల్ వీడియో !!

సుడిగాలి సుధీర్ అంటే బుల్లితెరపై ఓ స్టార్ హీరో రేంజ్ క్రేజ్ ఉంటుంది. బుల్లితెరపై స్టార్ ఎవరంటే నిస్సందేహంగా అందరూ సుడిగాలి సుధీర్ పేరు చెబుతారు. డ్యాన్సులు, కామెడీ, మ్యాజిక్, నటన, నవ్వించడం, ఏడిపించడం, రొమాన్స్ ఇలా ప్రతీ ఒక్క విషయంలో సుధీర్ తనకు తానే సాటి అని ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు. సుధీర్ లేని ఈవెంట్ ఉండదు.. ఉన్నా కూడా అంది అంతగా హిట్ అవ్వదు. అందుకే సుడిగాలి సుధీర్‌ను హైలెట్ చేస్తూ ఈవెంట్లు ప్లాన్లు చేస్తుంటారు.

Sudigali Sudheer Dance Performance In Akka Evare Athagadu
Sudigali Sudheer Dance Performance In Akka Evare Athagadu

ఒకప్పుడు సుధీర్‌ను ఎంతగా కించపరిచినా, సెటైర్లు వేసినా ఊరుకున్నారు. అవి వినోదం కోసమే కదా అని లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు వ్యవహారం మారింది. కామెడీ కోసమే అయినా అది స్కిట్‌లో భాగమే అయినా కూడా సుధీర్‌ను నోటికొచ్చినట్టు తిడితే ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు. విపరీతంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు. అలా రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్‌ను సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు.

ఇప్పుడు సుధీర్ అంటే కేవలం కమెడియనే కాదు. హీరో కూడా. అయితే వెండితెరపై అంతగా సక్సెస్ కాలేకపోవడం మాత్రం కాస్త నిరాశ కలిగించే విషయం. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఈటీవీ దసరా ఈవెంట్‌లో మాత్రం సుధీర్ దుమ్ములేపాడు. అక్కా ఎవరే అతగాడు అనే ఈవెంట్‌లో సుధీర్ చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు సంబంధించిన ప్రోమోను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. శేఖర్ మాస్టర్ సైతం సుధీర్ డ్యాన్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పేశాడు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles