చిన్నారి కంటి చూపుకు ఆర్థిక సహాయం చేసిన సుడిగాలి సుదీర్… ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు!

ప్రముఖ బుల్లితెర యాంకర్ సుడిగాలి సుదీర్ జబర్దస్త్ వేదికగా హాస్యాన్ని పండించడంలో సక్సెస్ సాధించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా హీరోగా తన సత్తా నిరూపించుకోవడానికి ఎంతో కృషి కృషి చేస్తున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కామెడీ షోకు కొన్ని కారణాలతో దూరమైన విషయం మనందరికీ తెలిసిందే. సుధీర్ ప్రస్తుతం పలు పాపులర్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ మెల్ యాంకర్ గా కొనసాగుతున్నారు.

తాజాగా సుడిగాలి సుదీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సుడిగాలి సుదీర్ రియల్ హీరో అంటూ చర్చ సాగుతోంది అందుకు కారణం సూపర్ సింగర్ జూనియర్ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న భువనేష్ కు చిన్నతనం నుంచి కంటిచూపు లేదన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎంతో కష్టపడి సూపర్ సింగర్ గా తన సత్తా నిరూపించుకున్నాడు. అయితే భువనేష్ కంటిచూపు తెప్పించడానికి చికిత్సకు అవసరమైన మొత్తాన్ని తానే భరిస్తానని సుదీర్ మాట ఇచ్చాడని భువనేశ్ తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఆపరేషన్ సక్సెస్ అయ్యే వరకు బయటికి చెప్పొద్దని సుధీర్ చెప్పారని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

సుడిగాలి సుదీర్ ఇటీవలే జబర్దస్త్ ప్రోగ్రాం లోకి ఎంట్రీ ఇస్తున్నారు అన్న విషయం కూడా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. పలు సందర్భాల్లో కూడా సుధీర్ ఈ విషయం గురించి ప్రస్తావ చేశారు. అయితే జబర్దస్త్ ప్రోగ్రాం యాజమాన్యం నుంచి ఎటువంటి అప్డేట్ ఇంతవరకు రాలేదు. సుధీర్ అభిమానులు జబర్దస్త్ ప్రోగ్రాం కి కచ్చితంగా రావాలని కోరుకుంటున్నారు. సుధీర్ జబర్దస్త్ ప్రోగ్రాంలో కనిపిస్తే తన కెరీర్ మరింత ముందుకెళ్తుందని సుదీర్ అభిమానులతో పాటు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సుధీర్ భువనేష్ కు కంటిచూపు తెప్పించడానికి సహాయం చేస్తున్న విషయం తెలియగానే అభిమానులు అతన్ని రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు.