ఆ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్న సుధీర్.. హిట్ అయితేనే అవకాశం?

బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ కు చాలా తక్కువ సమయంలోనే బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు రావడంతో ఈయన వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు.ఇలా వెండితెరపై ఈయన పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ కొన్ని సినిమాలలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే సుధీర్ సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. అదే విధంగా ఆటో రాంప్రసాద్ గెటప్ శ్రీనులతో కలిసి త్రీ మంత్స్ అనే సినిమాలో కూడా నటించారు.

ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా విజయం సాధించలేకపోయాయి అయితే ఈ సినిమాలు జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూనే ఈయన నటించారు. అనంతరం వెండితెర అవకాశాలు రావడంతో ఏకంగా జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పి సినిమాలలో నటిస్తున్నారు. ఇకపోతే ఈయన నటించిన సినిమాలన్నీ కూడా చిన్న బ్యానర్ లో తెరకెక్కినవి. ఇకపోతే తాజాగా సుదీప్ నటించిన వాంటెడ్ పండుగాడు సినిమా ఆగస్టు 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలకు సుధీర్ హాజరవుతున్నారు. ఇలా ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పటికీ ఈ సినిమా విషయంలో సుధీర్ ఎంతో ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితేనే తనకు తదుపరి సినిమాలలో నటించే అవకాశాలు వస్తాయని, ఈ సినిమా డబ్బులు రాబడితేనే తదుపరి సినిమాలు సెట్స్ పైకి వెళ్తాయని ముందుగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది అందుకే ఈ సినిమా విషయంలో సుధీర్ కాస్త ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాతో సుధీర్ విజయాన్ని అందుకుంటాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.