వామ్మో కాస్ట్లీ కారుపై కన్నేసిన శ్రీముఖి… కోరికలు మామూలుగా లేవుగా..?

బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. అదుర్స్ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీముఖి తన యాంకరింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా
గ్లామరస్ యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం శ్రీముఖి ఛానల్ తో సంబంధం లేకుండా అన్ని చానల్స్ లోను సందడి చేస్తోంది. ఇలా టీవీ షోస్ మాత్రమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ బాగా సంపాదిస్తుంది. ఇప్పటికే శ్రీముఖి కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొంతంగా కొత్త ఇంటిని నిర్మించుకుంది. అంతే కాకుండా కాస్ట్లి కారుని కూడా కోనుగోలు చేసింది.

అయితే శ్రీముఖి ఆశలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నట్టు తెలుస్తోంది. శ్రీముఖి కి రోల్స్ రాయిస్ కారుపై కన్ను పడింది. అసలు విషయం ఏమిటంటే ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న జాతి రత్నాలు అనే షో గత కొంతకాలంగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇటీవల ఈ షో వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఈ సంధర్భంగా శ్రీముఖి తో పాటు ఆ షో లో పాల్గొన్నవారందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో జాతి రత్నాలు 100వ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ఎపిసోడ్లో శ్రీముఖి చేసిన సందడి అంతా కాదు. అయితే ఈ ఎపిసోడ్ లో జాతి రత్నాలు 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది కానీ శ్రీముఖి మాత్రం లక్ష ఎపిసోడ్ల వరకు ఆలోచించింది.

జాతి రత్నాలు లక్షవ ఎపిసోడ్ కి శ్రీముఖి కి రోల్స్ రాయిస్ కారు, ఇమాన్యుయేల్‌కు బెంజ్.. పంచ్ ప్రసాద్ కి తోపుడు బండి అంటూ సెటైర్లు వేసింది. మొత్తానికి శ్రీముఖి ఎప్పటికైనా కోట్లు ఖరీదు చేసే రోల్స్ రాయిస్ కారు కొనాలని ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్లో శ్రీముఖి రోల్స్ రాయిస్ కారు కొంటుందా లేదా అన్నది చూడాలి మరి. ప్రస్తుతం శ్రీముఖి జాతి రత్నాలతో పాటు మరికొన్ని టీవీ షోస్ లో సందడి చేస్తోంది. అంతేకాకుండా చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.