కమెడియన్ తిరుపతి ప్రకాష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన కమెడియన్ కానీ ప్రస్తుతం అవకాశాలు బాగా తగ్గినట్లు కనిపిస్తున్నాయి అందుకే ఎక్కువగా వెండి తెర మీద కనిపించడం లేదు కానీ కొన్ని రోజులు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాంలో చేసేవారు. ఇప్పుడు అక్కడ కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించిన తిరుపతి ప్రకాష్ ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు.
ఆయన కెరియర్ కి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. పంచ్ ప్రసాద్, నాటీ నరేష్ ల కోసం నన్ను జబర్దస్త్ నుంచి తీసేసారని, జబర్దస్త్ లో ప్రోగ్రాం కోసం తను అమెరికాలో ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు తిరుపతి ప్రకాష్. అలాగే తాను సినిమాలలో నటించే రోజులలో బండ్ల గణేష్ తో మంచి స్నేహం ఉండేదని, ఇద్దరు ప్రాణ స్నేహితులు అని చెప్పారు.
అయితే బండ్ల గణేష్ నిర్మాత అయిన తర్వాత ఒక్క సినిమాలో కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదని, అంతేకాకుండా ఒక సినిమాకు డేట్స్ తీసుకొని, నాకు అబద్ధం చెప్పి ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇచ్చాడని తన ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రకాష్. 60 రోజులు షూటింగ్ ఉందని చెప్పి రోజుకి 15000 పారితోషం అని కూడా చెప్పాడు. అందుకే వేరే సినిమాలు ఒప్పుకోలేదు.
కానీ కరెక్ట్ గా షూటింగ్ కి ఏం బయలుదేరాల్సిన ముందు రోజు భారీ వర్షాల కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయింది అని ప్రొడక్షన్ మేనేజర్ చెప్పటంతో చాలా బాధపడ్డాను. ఈ సినిమా కోసం మూడు సినిమాలను వదిలేసుకున్నాను అయితే ఆ తర్వాత నా కన్నా తక్కువ రెమ్యూనరేషన్ కి ఎవరో ఆర్టిస్టు దొరికితే అతనితో చేయించేసాడని తెలిసి చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత తన తండ్రి చనిపోయినప్పుడు అతను ఫోన్ చేస్తే అవును అని చెప్పి వెంటనే పెట్టేసాను అని చెప్పారు తిరుపతి ప్రకాష్.