కొంటె చూపులతో కవ్విస్తున్న శ్రీముఖి… వైరల్ అవుతున్న ఫోటోలు…!

బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక టీవీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తూ తన మాటలతో అందాలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీముఖి.. సినిమాలలో కూడా నటించే అవకాశాలు అందుకుంటుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించిన శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇలా వరుసగా టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉంటున్న శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో శ్రీముఖి చేసే రచ్చ అంతా కాదు. తన అందమైన ఫోటోలతో పాటు ఫన్నీ వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా కొంతకాలంగా శ్రీముఖి గ్లామర్ డోస్ బాగా పెంచింది. కొంచెం బొద్దుగా కనిపించే శ్రీముఖి ఇటీవల కొంచెం బరువు తగ్గి నాజుగ్గా తయారయ్యింది. దీంతో సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది. పొట్టి బట్టలు ధరించి ముందు వెనుక తేడా లేకుండా తన మేని అందాలు ఆరబోస్తూ నెటిజన్స్ కి నిద్ర లేకుండా చేస్తోంది.

తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆకుపచ్చని దుస్తులలో షర్టు బటన్ విప్పి ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఈ ఫోటోలలో కొంటె చూపులతో కుర్రాళ్ళని రెచ్చగొడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇలా ప్రతిరోజు గ్లామర్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ అందాల ఆరబోతకు హద్దులు చెరిపేసి హీరోయిన్లకు పోటీగా తయారవుతోంది. శ్రీముఖి దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో ఆమెకు హీరోయిన్ గా నటించే అవకాశాలు వచ్చినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.