బుల్లితెరపై ఎంత కాంపిటేషన్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్లు ఎక్కువయ్యారు.. షోలు తక్కువ అవుతున్నాయి. వర్షిణి, వింధ్య, విష్ణు ప్రియ, శ్రీముఖి, భాను శ్రీ, రష్మి, అనసూయ ఇలా ఎంతో మంది ఉన్నారు. యాంకర్‌గా సుమది ప్రత్యేక కేటగిరి. ఆమెను ఢీ కొట్టేవారు ఎవ్వరూ లేరు. ఇకపై రారు కూడా. అలా సుమను పక్కనబెడితే.. రష్మీ అనసూయలు జబర్దస్త్‌ను బాగానే పంచుకున్నారు. వారికి కూడా ఏ ఢోకా లేదు.
ఎటొచ్చి మిగతా యాంకర్లకు ఓ స్థిరమైన స్టేజ్ లేదు. అటూ ఇటూ తిరగాల్సి వస్తుంది. యాంకర్ వర్షిణి ఢీలో ఫిక్స్ అయింది. నువ్వు రెడీ నేను రెడీ అనే కొత్త షోలో వింధ్య హల్చల్ చేస్తోంది. అదిరింది షోను భాను శ్రీ రవి నడిపించగా.. బొమ్మ అదిరిందిని శ్రీముఖి నడిపిస్తోంది. అయితే శ్రీముఖికి యాంకరింగ్ ఫీల్డ్‌లో ఉన్న కాంపిటేషన్ గురించి తెలిసిందే. మొన్నీ మధ్యే భాను శ్రీ తన మనసులో మాట చెప్పి మళ్లీ బొమ్మ అదిరిందికి యాంకర్‌గా తీసుకోండని విన్నవించుకుంది.
అసలే పటాస్ షో నుంచి బిగ్ బాస్‌కు వెళ్లాక శ్రీముఖికి సరైన షో పడలేదు. ఇక్కడ ఉండే కష్టాలు తెలుసు. అలా బొమ్మ అదిరింది అనే షో శ్రీముఖి చేతిలో పడింది. దాన్ని అంత ఈజీగా వదులుకోలేదు. తాజాగా ధన్ రాజ్ స్కిట్‌లో ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పింది. యాంకరింగ్ సీట్‌లో కూర్చోవాలని తన భార్యకు ఉందని శ్రీముఖి ధన్ రాజ్ దువ్వడం మొదలుపెట్టాడు. కాస్త గ్యాప్ తీసుకోవచ్చు కదా అని ధన్ రాజ్ శ్రీముఖిని వేడుకున్నాడు. ఒక్కసారి గ్యాప్ ఇస్తే ఎంత మంది దూరుతారో నాకంటే నీకే బాగా తెలుసు కదా అని శ్రీముఖి రివర్స్ కౌంటర్ వేయడంతో ధన్ రాజ్ బిత్తరపోయాడు. అంటే శ్రీముఖి గతంలో జరిగిన వాటి నుంచి గుణ పాఠం నేర్చుకుందన్న మాట.