కమెడియన్ అవినాష్ తో కలిసి రెచ్చిపోయి డాన్స్ చేసిన శ్రీముఖి.. ?

కమెడియన్ అవినాష్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఇండస్ట్రీలో పలు కామెడీ షోలతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. శ్రీముఖి అవినాష్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు.అవినాష్ కష్టకాలంలో ఉన్న సమయంలో శ్రీముఖి తనని ఆదుకుందని ప్రస్తుతం తాను ఈ పొజిషన్లో ఉన్నానంటే అందుకు కారణం శ్రీముఖి అంటూ అవినాష్ ఎన్నో సందర్భాలలో వెల్లడించారు.ఇకపోతే అవినాష్ పెళ్లి సమయంలో కూడా శ్రీముఖి దగ్గరుండి తన పెళ్లి వేడుకలను నిర్వహించారు.

ఈ విధంగా అవినాష్ శ్రీముఖి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉందని చెప్పాలి. ఇకపోతే వీరిద్దరూ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు. తాజాగా ప్రసారమైన ఈ వర్షం సాక్షిగా అనే కార్యక్రమంలో అవినాష్ శ్రీముఖి రొమాంటిక్ పర్ఫామెన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ డాన్స్ రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే శ్రీముఖి తాజాగా అవినాష్ తో కలిసి పల్సర్ బైక్ ఎక్కి రారా మామ అద్భుతమైన మాస్ సాంగ్ కి సూపర్ పెర్ఫార్మెన్స్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేసిన ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో అవినాష్ శ్రీముఖి పోటీపడి మరి డాన్స్ చేశారు.ఇక కెరియర్ విషయానికొస్తే అవినాష్ పలు బుల్లితెర కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ కెరియర్ల ముందుకు వెళ్తున్నారు. ఇకపోతే శ్రీముఖి ప్రతి ఒక్క ఛానల్లోనూ ఏదో ఒక కార్యక్రమంలో ద్వారా బుల్లితెరను ఏలుతోందని చెప్పాలి.