Siri-Sreehaan: సిరి, శ్రీహాన్ కూడా విడిపోనున్నారా.. సిరి బర్త్ డే రోజున శ్రీహాన్ పోస్ట్ వైరల్!

srihan post about siri goes viral on internet

Siri-Sreehaan: బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని షో.. ఈ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు పరిశ్రమలో ఈ బిగ్ బాస్ షో ఎవరూ ఊహించని విధంగా అందరి ఆదరణ పొంది సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది . బిగ్ బాస్ షో కి వెళ్ళిన వారిలో కొందరు వారి ఇమేజ్ డామేజ్ చేసుకొని బయటికి వస్తుంటే.. మరి కొందరు మాత్రం ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ -5 లో సన్నీ టైటిల్ గెలిచారు.

బిగ్ బాస్ సీజన్ -5 లో పాటిస్పేట్ చేసిన సిరి – షన్ముఖ్ కూడా వారి ఇమేజ్ మొత్తం నాశనం చేసుకున్నారు. వీరిద్దరూ యూట్యూబ్ వీడియోస్ వల్ల చాలా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ పుణ్యమా అని ఇప్పుడు మళ్లీ ఫేమస్ అవుతున్నారు. దీని కారణంగా తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతూ దీప్తి సునైనా – షణ్ముక్ నుండి విడిపోయారు. ఇదే తరహాలోనే సిరి – శ్రీహాన్ కూడా వారి ప్రేమ బంధానికి స్వస్తి చెప్పనునట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా సిరి పుట్టినరోజు సందర్భంగా శ్రీహాన్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.” హ్యాపీ బర్త్డే సిరి.. ఈ సంవత్సరం పాజిటివ్ వైబ్స్‌తో నీ జీవితం సాగిపోవాలని ఆశిస్తున్నా . నీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తావ్…గాడ్ బ్లస్‌ యు ” అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు . అయితే బిగ్ బాస్ లో సిరిని ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా ఆమె గెలుపు కోసం చివరి వరకు సిరిని ప్రోత్సహిస్తూ వచ్చాడు. కానీ.. సిరి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత సిరితో కలిసి ఎక్కడా కనిపించకపోవటం వల్ల అందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో దీప్తి-షణ్ముక్ లాగా సిరి-శ్రీహాన్ కూడా వారి ప్రేమ బంధానికి స్వస్తి చెప్పనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరి పుట్టినరోజు శ్రీహాన్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది