సమంతలాగే శ్రీహన్ టాటూ వేయించుకొని సర్ప్రైజ్ ఇచ్చిన సిరి?

బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇవ్వడంతో ఎంతో సందడి సందడిగా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు వారి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇంట్లో వారితో ఎంతో సంతోషంగా గడిపారు. ఈ క్రమంలోనే నేడు జరగబోయే ఎపిసోడ్లో భాగంగా శ్రీహాన్ కోసం సిరి తన కుమారుడు కూడా ఇంట్లోకి అడుగు పెట్టారు.ఇలా హౌస్ లోకి సిరి రాగానే శ్రీహన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావ్ అంటూ సిరి అడగగా తనకు కన్నుకొట్టి తనపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.

ఇక సిరి శ్రీహన్ ను ఒక్కసారి గట్టిగా హగ్ చేసుకోవడంతో బిగ్ బాస్ ఫ్రీజ్ అంటాడు. ఆ క్షణం శ్రీహన్ బిగ్ బాస్ మీకు పాత పరిచయాలు అనడంతో సిరి లవ్ యు బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరితో ముచ్చటించిన అనంతరం శ్రీహన్ తోపర్సనల్ గా మాట్లాడుతూ సిరి తనని కళ్ళు మూసుకోమని తనకు ఒక సర్ప్రైజ్ ఉందంటూ తన మెడపై పేర టాటూని చూపించారు. ఈ విధంగా శ్రీహాన్ పేరుతో రెండు లవ్ సింబల్స్ ఉన్నటువంటి టాటూ వేయించుకొని ఈమె సర్ప్రైజ్ ఇచ్చారు.

ఇక శ్రీహన్ సిరి కుమారుడు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరిని ఇమిటేట్ చేశారు.ఈ క్రమంలోనే ఆదిరెడ్డి ఎల్లప్పుడూ తన భార్యకు ఐ లవ్ యు కవిత అని చెప్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సిరి కుమారుడు కూడా లవ్ యు కవిత అంటూ ఇమిటేట్ చేసి అందరిని ఎంటర్టైన్ చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.