Siri Hanumanth: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ, నటి సిరి హనుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బిగ్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అలాగే సాఫ్ట్‌వేర్ బిచ్చగాళ్లు, మేడం సార్ మేడం అంతే, రామ్ లీలా, పులి మేక వంటి వెబ్ సిరీస్‌లతో ఫుల్ పాపులర్ అయింది. తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అలాగే నటుడు, ప్రియుడు శ్రీహాన్ తో కలిసి కొన్ని వెబ్ సిరీస్ లలో నటించింది. ఈ నేపథ్యంలోనే నటుడు శ్రీహాన్ తో ప్రేమలో పడింది. అయితే ప్రస్తుతం ఈ జంట కలిసి ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వారికీ సంబందించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.
https://www.instagram.com/p/DMzhRiDx4DV/?utm_source=ig_web_copy_link
ఇది ఇలా ఉంటే తాజాగా సిరి తనకు కాబోయే వాడితో కలిసి వరలక్ష్మి వ్రతం పూజ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీహాన్ పంచెకట్టులో ఉండగా సిరి చీరలో అందంగా ముస్తాబైంది. ఇది చూసిన కొందరు పెళ్లి కాకుండా ఇలా జంటగా వరలక్ష్మి వ్రతం చేయచ్చా? అయినా పెళ్లి కాకుండా ఇలా వరలక్ష్మి వ్రతం చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఇంకొందరు వీరిపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటారు అంటూ మండి పడుతున్నారు.
