అందరిముందూ జబర్దస్త్ భానుకి ప్రపోజ్ చేసిన సింగర్ రమణ… భాను రియాక్షన్ ఏంటో తెలుసా?

ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి బుల్లితెర చానల్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ క్రమంలో వివిధ రకాల టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి టీవీ షోలకు పేరుగాంచిన ఈటీవీ కామెడీ షోలు, డాన్స్ షోలు, సింగింగ్ షో లతోపాటు టాక్ షోలు కూడా ప్రసారం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ, క్యాష్, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా ఎంతోమంది కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ వారిలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఒక చక్కటి ప్లాట్ ఫామ్ ని అందిస్తోంది.

ప్రతి ఆదివారం ప్రసారం అవుతున్న ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఒక్క వారం ఒక్కో రకం కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ షో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘లిటిల్ హార్ట్స్’ అనే ఓ కొత్త ప్రోగ్రామ్ ప్రసారం చేయనుంది. ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల అయ్యింది. ఈ కార్యక్రమంలో బుల్లితెర సెలబ్రిటీలంతా వారి పిల్లలతో ఈ షో లో చాలా సందడి చేశారు. ఇక పేరెంట్స్ కి పిల్లలకు మద్య సరదా పోటీలు, డాన్స్ లతో ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.

ముఖ్యంగా ఈ షోలో హైపర్ ఆది హోస్ట్ గా చేసే సందడి మామూలుగా ఉండదు. ఇక ఈ షో లో పల్సర్ బైక్ సింగర్ రమణ కూడా కూడా హాజరయ్యాడు. రమణ తన పర్ఫార్మెన్స్ తో అందరిలో రెట్టింపు ఉత్సాహం నింపాడు. ఇక ఈ షో లో పాల్గొన్న యాంకర్ భాను కూడా రమణ పాటకు ఫిదా అయ్యింది. ఈ క్రమంలో రమణ అందరిముందూ మోకాలిపై కూర్చొని భాను కి ప్రపోజ్ చేశాడు. రమణ అందరిముందూ ఇలా ప్రపొజ్ చేయటంతో భాను కూడా సిగ్గుపడుతూ కనిపించింది. ఈ షో ద్వారా మల్లెమాల వారు మరొక జంటని తెరపైకి తెచ్చింది. మరి వీరి ప్రేమ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.