భర్త కోరిక నెరవేర్చలేకపోయానని బాధపడుతున్న శృతి.. తులసి కోరిక తీర్చడానికి సిద్ధపడిన సామ్రాట్..!

సామ్రాట్ తన సమస్య తీరిపోవాలని గుడికి వెళ్లి దేవుడికి ముడుపు కడతాడు . అలాగే తులసి కూడా తన కోరిక నెరవేరాలని ముడుపు కడుతుంది. కోరిక కోరుకున్నారు అని సామ్రాట్ తులసిని అడగ్గా.. అలా కోరుకున్న కోరిక గురించి బయటకు చెప్పకూడదు అని తులసి అంటుంది. ఆ తర్వాత ఇద్దరు బయలుదేరటానికి కారు దగ్గరకు వెళ్తారు. ఇక మరొకవైపు ఇంట్లో శృతి బాధపడుతూ ఉంటుంది. శృతి బాధగా ఉండటం చూసిన ప్రేమ్ ఏం జరిగిందని అడుగుతాడు. నువ్వు ఫ్రైడ్ రైస్ చెయ్యమని అడిగావ్ కానీ లాస్య అడ్డుపడిందని జరిగిందంతా చెప్తుంది. ఫ్రిజ్ కి తాళం వేసిన విషయం తెలుసుకుని ప్రేమ్ లాస్య మీద ఆవేశంతో ఊగిపోతు లాస్య దగ్గరికి కోపంగా వెళ్లబోతుంటే శ్రుతి ఆపుతుంది.

లాస్య కావాలని ఇలా చేస్తుంది…మనం గొడవ పడితే అంకుల్ ముందు తెలివిగా మనల్ని చెడుగా చూపించాలని లాస్య ప్లాన్ అని శ్రుతి అంటుంది. దీంతో ప్రేమ్ కోపంగా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకుని దర్జాగా ఆమె ముందే కూర్చుని తింటానని అంటాడు.ఇక గుడిలో తెలిసి ఏం కోరిక కోరుకుందో అని తెలుసుకోవడానికి సామ్రాట్ ప్రయత్నిస్తాడు. తులసిని కారులో కూర్చోబెట్టి కుంకుమ తీసుకు వస్తానని చెప్పి మళ్ళీ గుళ్లోకి వెళ్తాడు. తులసి కట్టిన ముడుపు విప్పి తులసి రాసిన చీటీ తెరవబోతుంటే పూజారి అక్కడికి వచ్చి తాను ఎంతో ఆశతో దేవుడికి తన కోరిక విన్నవించుకుంటూ ముడుపు కట్టింది. అది అమ్మవారికి చేరేలోపే నువ్వు విప్పావ్ కాబట్టి దాన్ని తీర్చాలసిన బాధ్యత నీదే. అలా చేయకపోతే అమ్మవారి ఆగ్రహానికి గురవుతావని
పూజారి చెప్పి వెళ్ళిపోతాడు.

తులసి ఎలాగైనా కోరిక తిరుస్తానని సామ్రాట్ అనుకుంటాడు. తులసి రాసిన చిటీలో పుట్టిన ఊరుకి వెళ్ళి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకోవాలి అని రాసి ఉంటుంది. తులసి గారు ఇంత చిన్న కోరిక కోరారు ఏంటి..ఎలాగైనా ఆమె కోరిక నెరవేర్చాలని సామ్రాట్ అనుకుంటాడు. ఇక మరొకవైపు అది చిన్న కోరిక అని అందరూ అనుకుంటారు కానీ అది ఎంత కష్టమో తనకి మాత్రమే తెలుసని కారులో ఉన్న తులసి అనుకుంటుంది.తులసి సామ్రాట్ కోసం తులసి వస్తుంటే తనే ఎదురుపడతాడు. సామ్రాట్ సంతోషంగా ఉండటం చూసి ఎందుకు అంత ఆనందం అని తులసి అడుగుతాడు. అమ్మవారి కుంకుమ కోసం వెళ్లి అక్కడే ఉన్నారు. ముడుపులో ఉన్న కోరిక అమ్మవారు చదివారో లేదో అని తులసి అంటే ..చదివేసిందని సామ్రాట్ నోరు జారతాడు. అదేంటి మీకు ఎలా తెలుసని తులసి అనుమానంగా అడుగుతుంది.