ఆదికి ముద్దు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చిన శ్రద్ధాదాస్.. ముద్దు కోసం బేరం ఆడిన ఆది?

ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ రియాలిటీ షో కి ఎంత మంచి గుర్తింపు ఉందో అందరికి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ప్రసారమవుతున్న ఈ షో ద్వారా చాలామంది ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లుగా గుర్తింపు పొందారు. ఈ షో ద్వారా కొరియోగ్రాఫర్లుగా మారిన వారు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో కొరియోగ్రఫీ చేసే అవకాశాలను అందుకుంటున్నారు. ఇంతటి మంచి గుర్తింపు ఉన్న ఈ డాన్స్ షో గత కొంతకాలంగా గాడి తప్పినట్లు తెలుస్తోంది. డాన్స్ షో అంటే కేవలం డాన్స్ మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రసారమవుతున్న ఈ డాన్స్ షో లో డాన్స్ తప్ప అన్ని ఉన్నాయి. ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్లు డాన్స్ పేరుతో సర్కస్ లు, జిమ్నాస్టిక్ లు చేస్తున్నారు.

ఇక ఈ షోలో జడ్జిగా వ్యవహరించే వారు కూడా అలాగే ఉన్నారు. డాన్స్ గురించి ఏ మాత్రం అవగాహన లేని హీరోయిన్లను జడ్జ్ లుగా పెడుతున్నారు. ఈ షో లో జడ్జ్ గా వ్యవహరిస్తున్న పూర్ణ ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతోంది. కంటెస్టెంట్లు చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ నచ్చితే చాలు వారి వద్దకు వెళ్లి హగ్గులు ఇవ్వడం, బుగ్గలు కొరకటం, ముద్దులు పెట్టడం వంటి వెకిలి చేష్టలు చేస్తూ ఉంటుంది. ఇక కొంతకాలంగా ఢీ లో జడ్జ్ గా సందడి చేస్తున్న శ్రద్దాదాస్ కూడా పూర్ణ అడుగుజాడల్లో నడుస్తోంది. ఈ అమ్మడు కూడా ముద్దులు, హాగ్గులతో రెచ్చిపోతోంది. దీంతో ఆది కూడా శ్రద్ద ముద్దు కోసం తెగ ఆరాటపడుతుంటాడు.

ఇక ఈవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో కూడా ఆది శ్రద్ధ ముద్దు కోసం సాహసం చేశాడు. ఒక నిమిషం పాటు ఐస్ క్యూబ్ మీద నిలబడితే ముద్దు ఇస్తానంటూ శ్రద్ధాదాస్ బంపర్ ఆఫర్ ఇవ్వటంతో ఆది ఎలాగైనా ఆమెతో ముద్దు పెట్టించుకోవాలని ఈ సాహసానికి రెడీ అయ్యాడు. దీంతో ఐస్ క్యూబ్ మీద ఎక్కటానికి ముందు ఎనర్జీ కోసం ఒక హాఫ్ కిస్ ఇవ్వచ్చుగా బేరాలు ఆడాడు. మొత్తనికి శ్రద్దాదాస్ ఇచ్చే ముద్దు కోసం ఆది సాహసం చేసి ఐస్ క్యూబ్ మీద నిలబడ్డాడు. అయితే ఐస్ క్యూబ్ మీద నిలబడలేక పాటలు పాడుతూ కవర్ చేశాడు.