ఆ హీరోతో ఛాన్స్ వస్తే ఏ మాత్రం వదులుకోను… మంత్రి రోజా కామెంట్స్ వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి రోజా ఒకరు ఈమె ఒకప్పుడు తెలుగు తమిళ భాషలలో సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోజా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోల సరసన నటించిన వందల సినిమాలలో నటించారు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరు సరసన నటించిన ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈమె రాజకీయాల్లోకి వచ్చారు.

ఇలా రాజకీయాలలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోజా ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏపీ టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలా ఈమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. అయితే తిరిగి ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక అందరిలాగే రోజాకు కూడా ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో ఉన్నారని ఆయనతో నటించే అవకాశం వస్తే ఏ మాత్రం వదులుకోనని పలు సందర్భాలలో తెలియజేశారు.

మరి రోజాకు ఫేవరెట్ హీరో ఎవరుఅనే విషయానికి వస్తే ఈమెకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టమని పలు సందర్భాలలో తెలియచేశారు. మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వస్తే ఏమాత్రం వదులుకొని రోజ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో హైపర్ ఆది మహేష్ బాబు లాగా, శాంతి స్వరూప భూమిక లాగా ఒక్కటి సినిమా స్పూఫ్ చేశారు. దీంతో ఇంకొకసారి మహేష్ బాబును ఇలా స్పూఫ్ చేసావంటే చంపేస్తా ఫ్యాన్ ఇక్కడ అంటే రోజా చెప్పిన సంగతి తెలిసిందే.