అనసూయకి శ్రద్ద దాస్ సపోర్ట్… ఏకిపారేస్తున్న నెటిజన్స్?

ప్రస్తుతం ట్విట్టర్ లో ఎక్కడ చూసినా ఆంటీ ఆంటీ అనే పదం మారుమోగుతోంది. ఆంటీ అని పిలుస్తూ తనని ఏజ్ షేమింగ్ చేస్తున్నారంటూ అనసూయ మండి పడుతోంది. ఇటీవల లైగర్ సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా ప్లాప్ అవడంతో అనసూయ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ” అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా ” అంటూ విజయ్ ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేసింది. దీంతో విజయ అభిమానులతో పాటు నేటిజన్స్ కూడా ఆంటీ అంటు అనసూయని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆంటీ ఆంటీ అంటు అనసూయని విసిగిస్తున్నారు. దీంతో అనసూయ మండిపడుతూ ఆంటీ అని కామెంట్ చేసిన వారి స్క్రీన్ షాట్ తీసుకొని వారి మీద కంప్లైంట్ చేస్తా అంటూ బెదిరిస్తోంది.

అయితే నెటిజన్స్ మాత్రం అనసూయ బెదిరింపులకు భయపడకుండా మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా ఈ వివాదంలోకి హీరోయిన్ శ్రద్దా దాస్ ఎంటర్ అయ్యింది. అనసూయకి సపోర్ట్ చేస్తూ.. ” నీకంటే సగం వయసున్న అమ్మాయిల కంటే కూడా నువ్వే అందంగా ఉంటావు. నీకంటే ఎక్కువ వయసున్న అంకుల్స్‌ కన్నా నువ్వే చాలా హాట్‌గా కనిపిస్తావు. నేను నీకు ఎల్లప్పుడూ అభిమానినే ” అంటూ రాసుకొచ్చింది. దీంతో నెటిజన్స్ శ్రద్దా దాస్ ని టార్గెట్ చేసి ఏకిపారేస్తున్నారు. ఇటీవల ఈ వివాదం పై స్పందించిన శ్రద్ద చాలా కూల్ గా స్పందించింది.

ఈ క్రమంలో శ్రద్దా దాస్ ట్వీట్ చేస్తూ … అనసూయని పోగిదినందుకు నన్ను ఇలా ట్రోల్ చేస్తూ మీ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ విషయంలో మీరు నన్ను ఎంత దూషించినా కూడా ట్వీట్లన్నీ డిలీట్‌ చేసి మీ అందరి ఖాతాలను కూడా బ్లాక్‌ చేస్తాను. అనసూయని పొగిడినందుకు నన్ను ఇలా ట్రోల్ చేయటంలో అర్థం లేదు అంటూ చాలా కూల్ గా సమధానం చెబుతూ.. ట్వీట్‌ చేసింది. అయితే శ్రద్ద చేసిన ట్వీట్ పై స్పందించిన ఓ నెటిజన్‌ ‘అనసూయ ఏం చేస్తుందో మీకు తెలీదు. విజయ్ దేవరకొండ పై ఎప్పటినుంచో ఉన్న కోపం ఇప్పుడు వెల్లగక్కుతోంది. అనవసరంగా అనసూయ కి సపోర్ట్‌ చేయకండి’ అని కామెంట్ చేశాడు. మొత్తానికి అనసూయ ఆంటీ వివాదం ఇంకా చాలా దూరం వెళ్లేలా ఉంది.