సుమ లేకపోతే ఈ రోజు నేను లేను.. సీనియర్ నటి ఎమోషనల్ కామెంట్స్?

బుల్లితెర మహారాణిగా వెలుగొందుతున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత కాలంలో బుల్లితెర మీద ఎంతోమంది యాంకర్లు తమ గ్లామర్ తో అలరిస్తున్నప్పటికీ సుమకి పోటీగా నిలువలేక పోతున్నారు. ఇలా టీవీ షోస్ తో పాటు సుమ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొంటూ నిత్యం బిజీగా ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెర మీద సుమ చేస్తున్న టీవీ షోస్ లో క్యాష్ షో కూడా ఒకటి ఈ షోలో సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రతివారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోలో ఎంతోమంది సెలబ్రిటీలు సందడి చేస్తూ ఉంటారు.

ఈ షో కి హాజరయ్యే సెలబ్రిటీలతో సుమ ఫన్నీ టాస్కులు ఆడించి ఎంతో సందడి చేస్తూ ఉంటుంది. సుమ యాంకరింగ్ తో ఈ షో ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అయితే వచ్చేవారం ప్రసారం కాబోయే క్యాష్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ షో లో సీనియర్ నటీనటులు హాజరయ్యారు. ఇక సీనియర్ నటులైన కూడా సుమా వీరికి ఫన్నీ టాస్క్ లు ఇచ్చి సందడి చేసింది. ఈ షో లో సీనియర్ ఆర్టిస్టుల అల్లరితో పాటు సుమ ఉత్సాహంతో షో సరదాగా సాగింది. ఇక ఈ షో లో ప్రముఖ సీనియర్ నటుడు జెన్నీ కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలో సుమ మీ పెళ్లి కన్నా ముందు ఏవైనా ప్రేమ కథలు ఉన్నాయా అని ఆయన్ని ప్రశ్నించింది.. దీనికి సుభాషిణి కలుగజేసుకుని పెళ్లికి ముందు ఏంటి ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి అని అంటుంది.

ఇక ఈ షో క్లైమాక్స్ లో సీనియర్ నటి సుభాషిణి తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ..సుమ చేసిన సాయం గురించి కూడా చెప్పుకొచ్చింది. నేను ఏరోజు ప్రాణాలతో ఉండటానికి కారణం సుమ. నేను క్యాన్సర్ బారిన పడినప్పుడు సుమ నా వైద్యానికి కావలసిన సహాయం చేయటమే కాకుండా ఇప్పటికీ 6 నెలలకు ఒకసారి నాకు కావలసిన మందులు అన్ని పంపుతుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు కూతురిగా పడతాను. నువు నా బంగారు తల్లివి అంటూ సుమ గురించి చెబుతూ కనీళ్ళు పెట్టుకుంది. దీంతో సుమ కూడా సుభాషిణి ని కౌగిలించుకుని కంట తడి పెట్టుకుంది.