పైన ఉన్న ఫోటో చూశారా, తల్లితో కలిసి గారాలుపోతున్న పాపాయి ఎంత ముద్దుగా ఉందో. నిండైన ముస్తాబుతో మహాలక్ష్మి కళ ఉట్టి పడుతున్న ఈ పాపాయిని చూసి ఆడపిల్ల అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఆ అమ్మాయి పాప కాదు బాబు, అతను ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరో అంటే మీరు ఆశ్చర్య పోవాల్సిందే, నిజమేనండి ఆ పాప మరెవరో కాదు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.
చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ హీరో తర్వాత హిట్స్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రిపబ్లిక్ సినిమా తర్వాత ఆయన నుంచి కొత్త సినిమాలు ఏవి రాకపోవడానికి కారణం గత ఏడాది ఆయనకు జరిగిన రోడ్డు ప్రమాదం. ప్రమాదం నుంచి బయటపడి పూర్తిగా కోలుకున్న తర్వాత తన తదుపరి సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు సాయి తేజ్.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ ఈవెంట్ కు రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్లో స్టేజిపై ఈ ఫొటో చూపించి యాంకర్ సుమ దీని గురించి సాయి తేజ్ ని ప్రశ్నించింది. ఆ ఫోటో గురించి మాట్లాడుతూ సాయి తేజ్ ఈ విధంగా చెప్పాడు. ప్రతి అమ్మ తన కొడుకుని అమ్మాయిలాగా తయారు చేసి ముచ్చట పడుతుందని, తన అమ్మ కూడా అలాగే ముచ్చట పడిందని చెప్పాడు.
అంతేకాకుండా ఇంట్లో ఆడవాళ్ళతో పాటు బయట ఆడవాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని తన తల్లి తనతో చెప్పినట్లు చెప్పాడు సాయిధరమ్ తేజ్. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదే ఈవెంట్ లో మెగా ఫ్యామిలీ పిక్చర్స్ కొన్ని చూపించి వాటి వెనుక ఉన్న కథలను అడిగి తెలుసుకుంది సుమ. ఈవెంట్ కి రామ్ చరణ్ గెస్ట్ గా రావడంతో అతను కూడా ఈ పాత జ్ఞాపకాల వెనక ఉన్న కథల గురించి చెప్పాడు.