తులసి పై ఉన్న ప్రేమను బయటపెట్టిన సామ్రాట్… తులసికి మరో ఛాలెంజ్ విసిరిన లాస్య!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్నికి వస్తే…తులసి తిరిగి ఇంటికి వెళ్లిపోవడంతో సామ్రాట్ బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో తన బాబాయ్ వచ్చి తులసి గురించి ప్రశ్నించడంతో తన మనసులో తులసికి ఉన్న స్థానాన్ని చెబుతూ తనపై ఉన్న ప్రేమను బయటపెడతాడు. అంటే నీ ప్రేమను చంపుకుంటున్నావా అని తన బాబాయ్ అడగడంతో చంపుకోలేదు భద్రంగా దాచుకుంటున్నాను అని సామ్రాట్ తులసి పై ఉన్న ప్రేమను తెలియజేస్తాడు.

మరోవైపు శృతి కిచెన్ లో పనిచేస్తూ ఉండగా అంతలోపే అక్కడికి రాములమ్మ వస్తుంది. రాములమ్మ రాగానే తనని తులసి అమ్మగారు రమ్మన్నారని ఎప్పటిలాగే గలగల మాట్లాడుతుంది.ఇక రాములమ్మకు శృతికి సంబంధించిన పనులన్నింటిని చూసుకోమని తులసి చెబుతుంది. ఆపిల్ జ్యూస్ ఇవ్వడం కోసం ఫ్రిడ్జ్ తీయగా తాళాలువేసి ఉండడంతో ఏంటి ఇది అని తులసి అడగగా ఇప్పటికి లాస్య ఆంటీ ఇంకా ఏమి మారలేదు తను అలాగే పెత్తనం చేస్తుంది అని శృతి చెప్పడంతో వెంటనే తులసి లాస్య వద్దకు వెళుతుంది.

తులసి లాస్య వద్దకు వెళ్లి తాళాలు ఇవ్వమని అడిగితే ఇల్లు నీ పేరు మీద ఉందని పెత్తనం కూడా నువ్వే చలా ఇస్తావ్ అనుకుంటే సరిపోదు ఇంటి కోడల్ని నేను అంత నేను చెప్పినట్టే జరగాలి అని అనడంతో తులసి లాస్యకు తన స్టైల్ లో సమాధానం చెబుతుంది నీ అహంకారం వల్లే నేను ఇక్కడికి తిరిగి వచ్చాను. మర్యాదగా తాళాలు ఇవ్వు అనడంతో లాస్య ఇవ్వనని చెబుతుంది.దీంతో చేసేదేమీ లేక తులసి లాస్య చేతిలో ఉన్నటువంటి తాళాలను బలవంతంగా లాక్కుంటుంది. నేను వచ్చిందే ఈ ఇంట్లో నీ నుంచి ఒక్కొక్కటి లాక్కోవడానికి అని సమాధానం చెబుతుంది.

అసలు నువ్వెవరు ఈ ఇంటికి పరాయి దానివి నేను ఈ ఇంటి కోడల్ని అనడంతో నువ్వు ఈ ఇంటికి కోడలివి కాదు కేవలం నందగోపాల్ కి భార్యవి అది కూడా రెండో భార్యవి.నువ్వు ఈ ఇంటికి ఎప్పుడు కోడలివి కాలేవు అలాగే నా పిల్లలకు తల్లి కాలేవు అని తులసి చెప్పడంతో నెల తిరిగేలోపు ఇంట్లో వాళ్ళందరినీ నా వైపుకు తిప్పుకుంటాను అంటూ తులసితో చాలెంజ్ చేస్తుంది. పాట పాడుతూ ఉండగా తులసి ఎంతో సంతోషపడుతుంది అయితే తులసి గిటార్ తీసుకువస్తాను పాట పాడుదువు అని చెప్పడంతో ప్రేమ్ కంగారు పడతారు అయితే తులసి గిటార్ తీసుకురావడంతో ప్రేమ్ ఆశ్చర్యపోతాడు. శృతి హాస్పిటల్ కోసం నేను అమ్మేసిన గిటార్ అని చెప్పడంతో నేను ఆరోజు దీనిని కొన్నానని చెప్పి ప్రేమ్ కు ఇస్తుంది.