రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాతల పెళ్లి జరిగేది అప్పుడే.. అసలు విషయం చెప్పేసిన గెటప్ శ్రీను?

బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు కొనసాగుతున్న వారిలో జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ ఒకరు.బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జోర్దార్ సుజాత ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇక రాకింగ్ రాకేష్ స్కిట్ లో చేస్తున్నటువంటి ఈమె ఎన్నో లవ్ స్కిట్లు చేయడంతో అందరిలాగే వీరి మధ్య కూడా జబర్దస్త్ వాళ్ళే లవ్ ట్రాక్ నడిపించారని భావించారు. అయితే వీరిద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉందని ప్రేమికుల దినోత్సవం రోజు బయటపెట్టారు.

ఫిబ్రవరి 14వ తేదీ వేదికపైనే రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత చేతికి రింగు తొడిగి తన లవ్ ప్రపోజ్ చేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అప్పటినుంచి ప్రేమ పక్షులుగా విహరిస్తున్నటువంటి ఈ జంట పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా జోర్దార్ సుజాత ఏకంగా రాకింగ్ రాకేష్ వాళ్ళ ఇంటికి వెళ్లి వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇకపోతే ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకోబోతారనే విషయం గురించి అభిమానులలో కూడా సందేహం నెలకొంది. అయితే తాజాగా మన ఊరి దేవుడు అనే కార్యక్రమంలో భాగంగా గెటప్ శీను జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్ పెళ్లి గురించి మాట్లాడుతూ అసలు విషయం వెల్లడించారు.2023 ఫిబ్రవరిలో వీరిద్దరి వివాహం జరగబోతుందని గెటప్ శీను చెప్పడంతో వీరి అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరిద్దరూ ఎంతో సంతోషంగా కలకాలం అన్యోన్యంగా ఉండాలి అంటూ పెద్ద ఎత్తున అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.