అందరికీ గుడ్ న్యూస్ చెప్పిన రాకింగ్ రాకేష్.. రోజా సమక్షంలోనే పెళ్లి!!

Rocking Rakesh Brother Marriage In Atto Attamma Kuthuro event

ఈ మధ్య స్టేజ్ మీదే కొన్ని కార్యక్రమాలు చేసేస్తున్నారు. పండుగలకు చేసే ఈవెంట్లలో ఏదో ఒక స్పెషాల్టీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్లను పట్టుకొచ్చి అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేసేస్తున్నారు. ఇందులో భాగంగా సంక్రాంతికి జబర్దస్త్ టీం చేస్తున్న అత్తో అత్తమ్మ కూతురో ఈవెంట్‌లోనూ ఓ స్పెషల్ ప్రోగ్రాంను ప్లాన్ చేసేశారు. రాకింగ్ రాకేష్ ఫ్యామిలీ మెంబర్స్‌ను స్టేజ్ మీదకు తీసుకువచ్చాడు. రీసెంట్‌గా తన సోదరుడి పెళ్లి అయిందని స్టేజ్ మీద ప్రకటించాడు.

తన ఫ్యామిలీ మొత్తానికి స్టేజ్ మీదకు తీసుకువచ్చాడు. రాకేష్ తమ్ముడు తన ప్రేమ గురించి చెప్పాడు. తొమ్మిదేళ్ల ప్రేమ అంటూ రోజా ముందే అసలు విషయం చెప్పేశాడు. మీ అన్న కంటే నువ్వే బెటర్ అంటూ రాకేష్ పరువు తీసేసింది రోజా. అయితే రాకేష్ అమ్మ మాటలు అందరినీ టచ్ చేశాయి. మొదట్లో ఫ్రెండ్ అని పరిచయం చేశాడు.. ప్రేమ, పెళ్లి అని చెప్పలేదు.. నాతో చెప్పడానికే చాలా బయపడ్డాడు అన్నతో చెప్పలేదు అని రాకేష్ అమ్మ చెప్పుకొచ్చింది.

Rocking Rakesh Brother Marriage In Atto Attamma Kuthuro event
Rocking Rakesh Brother Marriage In Atto Attamma Kuthuro event

మరి మీరు చెప్పొచ్చు కదా అని రోజా అడిగింది. నేను కూడా నా పెద్ద కొడుకుకు భయపడ్డాను అని రాకేష్ అమ్మ అనడంతో అందరూ షాక్ అయ్యారు. కానీ రాకేష్ మాత్రం తల్లిని పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి రోజా సమక్షంలోనే మళ్లీ దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఇక అందరూ కూడా ఆ కొత్త జంటను దీవించారు. ఇలా సంక్రాంతి ఈవెంట్‌లో రాకేష్ ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలానే ఉంది.

Atto Attamma Kuthuro Promo 03 - Sankranthi Special Event 2021 - Hyper Aadi,Anasuya,Rashmi