జబర్దస్త్ నుండి బయటికి వెళ్లాలంటే భయం వేస్తుంది…రాఘవ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కమెడియన్ లలో రాకెట్ రాఘవ కూడా ఒకరు. జబర్దస్త్ మొదలైన దగ్గర నుంచి ఆ షోలో కొనసాగుతున్న రాకెట్ రాఘవ జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు . జబర్దస్త్ ముందు సినిమా సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలలో నటించిన రాకెట్ రాఘవ 2013లో జబర్దస్త్ ప్రారంభించిన తర్వాత జబర్దస్త్ లో అవకాశం దక్కించుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వందల స్కిట్ లు చేశాడు. తొమ్మిది సంవత్సరాలుగా ప్రచారం అవుతున్న ఈ జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన ఎంతోమంది సినిమా ఆఫర్లు రావటంతో బయటికి వెళ్తున్నారు. కానీ రాఘవ మాత్రం ఇప్పటికీ జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు.

ఇటీవల హైపర్ ఆది, సుధీర్, అభి, రాంప్రసాద్, గెటప్ శీను అంటే ఎంతో మంది ఆర్టిస్టులు జబర్దస్త్ కి దూరమయ్యారు . ప్రస్తుతం కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ గురించి చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రాకెట్ రాఘవ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో రాకెట్ రాఘవ మాట్లాడుతూ…జబర్దస్త్ షో ద్వారా జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నాను . అలాగే ఈ షో లో ఉన్న సీనియర్ యాక్టర్ ల నుంచి చాలా నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. మునుపటికన్నా జబర్దస్త్ ఇప్పుడే బాగుంది. ఇప్పుడు తక్కువ టైమ్ లో ఎక్కువ కామెడీ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాము అంటూ వెల్లడించాడు. జబర్దస్త్ షో కి వచ్చే కొత కమెడియన్ల నుంచి నేర్చుకొని నన్ను నేను అప్డేట్ చేసుకున్నాను అంటూ రాఘవ చెప్పుకొచ్చారు.

అయితే ఇంటర్వ్యూలో జబర్దస్త్ వీడి వెళ్లడం గురించి యాంకర్ ప్రస్థావించగా రాఘవా స్పందిస్తూ.. నేను జబర్దస్త్ కి దూరం కాకుండా ఉండటానికి రెండు కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. మొదటిది జబర్దస్త్ లో నేను చేసే పని వల్ల నాకు చాలా సంతృప్తి దొరుకుతుంది. ఇక రెండవది అంటే జబర్దస్త్ నుండి బయటికి వెళ్లిన వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఒకసారి ఈ ప్లేస్ వదిలి వెళ్ళిపోతే మనకు మళ్లీ ఇక్కడ స్థానం దొరకదు. అందుకే నాకు జబర్దస్త్ వదిలి వెళ్లాలంటే భయం అని చెప్పుకొచ్చారు. అయితే గతంలో తన పై వచ్చిన కోల్డ్ వార్ సంగతి గురించి యాంకర్ అడగగా.. నేనెప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాను నాకు అసలు నాకు ఆ విషయం గురించి తెలియదు అంటూ రాఘవ వెల్లడించాడు.