సుడిగాలి సుధీర్ కెరియర్ ఇలా అవ్వడానికి ఆయనే కారణమా.. ఇందులో నిజమెంత?

బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు సుడిగాలి సుదీర్. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇలా ఈ కార్యక్రమాలతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో ఏకంగా అభిమానులు ఈయనని బుల్లితెర మెగాస్టార్ అంటూ కూడా పిలిచేవారు. ఈ కార్యక్రమాల ద్వారా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న సుధీర్ కు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఈ విధంగా బుల్లితెర వెండితెరపై ఎన్నో అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నటువంటి సుధీర్ ఒక్కసారిగా మల్లెమాల వారి కార్యక్రమాలను వదిలి బయటకు వచ్చారు.అయితే సుధీర్ ఇలా బయటకు రావడానికి గల కారణం ప్రముఖ యాంకర్ ఓంకార్ అని తెలుస్తుంది. ఆయన జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్న వారికి ఎన్నో ఆశలు చూపించి ఈ కార్యక్రమం నుంచి బయటకు పిలిపించారని ఇలా ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన వారిని కామెడీ స్టార్స్ కార్యక్రమం ద్వారా స్టార్ మా లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని తెలుస్తోంది.

ఈ విధంగా ఓంకార్ కారణంగానే సుదీర్ కూడా బయటకు వచ్చారని ఆయన వల్లే సుదీర్ కెరియర్ ఇలా నాశనమైందంటూ కొందరు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే స్టార్ మా లో కొంతకాలం పాటు కొనసాగిన సుధీర్ ప్రస్తుతం స్టార్ మాకు దూరమయ్యారు. అయితే ఈయన ఆహా వేదికగా మరొక కామెడీ షోద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా కొన్ని రోజులు పాటు బిజీ అయిన సుధీర్ అనంతరం అవకాశాల కోసం వేచి చూడాలి అంటూ అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.