జబర్దస్త్ కొత్త యాంకర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మి…?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా రష్మీ యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. జబర్దస్త్ షోకి రాకముందు ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించిన కూడా రష్మీకి సరైన గుర్తింపు లభించలేదు. కానీ జబర్దస్త్ లో అడుగుపెట్టిన తర్వాత యాంకర్ గా బాగా పాపులర్ అయ్యింది. అంతేకాకుండా సుధీర్ తో ఉన్న రిలేషన్ వల్ల కూడా మరింత పాపులర్ అయ్యింది. ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం జబర్దస్త్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో జబర్దస్త్ షో కి స్వస్తి చెప్పింది. అనసూయ జబర్దస్త్ కి దూరమైన తర్వాత ఆమె స్థానంలో కొత్త యాంకర్ వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ అనసూయ స్థానంలో యాంకర్ గా ప్రేక్షకులను ఆకట్టుకోగల అర్హత రష్మికి ఉందని భావించిన మల్లెమాలవారు జబర్దస్త్ లో కూడా రశ్మిని యాంకర్ గా నియమించారు.

ఇలా అనసూయ జబర్దస్త్ కి దూరమైన రోజు నుండి ఇప్పటివరకు ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ లో కూడా రష్మి యాంకర్ గా కొనసాగుతూ సందడి చేస్తోంది. ఇలా రెండు షోల ద్వారా రష్మీ అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా అందుకుంటుంది. అయితే తాజాగా సౌమ్య రావు అనే అమ్మాయిని మల్లెమాలవారు జబర్దస్త్ యాంకర్ గా పరిచయం చేశారు. దీంతో రష్మీకి జబర్దస్త్ యాంకర్ పోస్ట్ పోయింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మి కొత్త యాంకర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఈ ఇంటర్వ్యూలో రష్మి మాట్లాడుతూ.. జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావుపై తనకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదని వెల్లడించింది. అనసూయ స్థానంలో జబర్దస్త్ యాంకర్ గా కొంతకాలమే నేను వ్యవహరించనున్నట్లు నాకు ముందే మల్లెమాలవారు వివరించారని వెల్లడించింది. జబర్దస్త్ లో సౌమ్య రావు యాంకర్ గా రాబోతున్నట్లు తనకు ముందే తెలుసని చెప్పుకొచ్చింది. తన పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదని.. అలాగే మల్లెమాల సంస్థ కూడా తనకి హోమ్ ప్రొడక్షన్ లాంటిదని చెప్పుకొచ్చింది. సౌమ్య రావు ఇతర షోలతో బిజీగా ఉన్నా లేక జబర్దస్త్ షోలు స్కిప్ చేసినా కూడా మళ్లీ జబర్దస్త్ యాంకర్ గా నేను వెళ్తానని వెల్లడించింది. ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ లో నా స్థానం పదిలంగానే ఉంది. అందుకు చాలా సంతోషం అంటూ చెప్పుకొచ్చింది.