వీకెండ్ లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన రష్మీ.. వైరల్ అవుతున్న మందు గ్లాసు ఫోటోలు..!

బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మి గౌతమ్ గురించి తెలియని వారంటూ ఉండరు. సినిమా ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన రష్మి ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. ఎన్నో ఏళ్లుగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూ ఆ చానల్లో ప్రచారం అవుతున్న అనేక ప్రత్యేక కార్యక్రమాలలో సందడి చేస్తోంది. అంతేకాకుండా ఈ అమ్మడు హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో నటించింది. హీరోయిన్ గా సరైన గుర్తింపు లభించకపోవడంతో బుల్లితెరకకే పరిమితమైంది. సుధీర్ అనసూయ ఈటీవీకి దూరమవడంతో జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి మూడు షోలకు కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తు బిజీ అయ్యింది.

అంతే కాకుండా రష్మి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన అందమైన ఫోటోలతో పాటు తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. కుక్కలంటే అమితమైన ప్రేమ ఉన్న రష్మి వాటికి అన్యాయం జరిగితే మాత్రం చాలా సీరియస్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తుంది. అంతే కాకుండా రోడ్డు మీద ఆహారం లేక తిరుగుతున్న కుక్కలను ఆదరించి వాటిని ఇంటికి తీసుకెళ్ళి మరి వాటి బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. ఇక వారాంతరంలో తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పబ్ లకు వెళ్తూ , లాంగ్ డ్రైవ్ లంటు తెగ ఎంజాయ్ చేస్తోంది.

ఇటీవల కూడా ఈ అమ్మడు తన స్నేహితులతో కలిసి వీకెండ్ బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. రష్మి తన స్నేహితులతో కలిసి చిల్ అవుతున్న ఫోటోలను తానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో రష్మి తన స్నేహితులు మందు గ్లాసులు పట్టుకొని ఉన్నారు. వీరందరూ కలిసి నైట్ మొత్తం ఇలా బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.