రష్మీలో ఈ యాంగిల్ ఇంత వరకు ఎవ్వరూ చూసి ఉండరు.. దెబ్బకు అందరూ షాక్!!

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ మీద యాంకర్‌గా ఓ వెలుగు వెలిగింది రష్మీ. అంతకు ముందు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసినా గుర్తింపు రాలేదు. కానీ జబర్దస్త్ యాంకర్‌గా రష్మీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఇక్కడ వచ్చిన ఫాలోయింగ్ వల్లే వెండితెరపై ఏకంగా హీరోయిన్ పాత్రల్లో మెరిసింది. అయితే బుల్లితెరపై సక్సెస్ అయినంతంగా వెండితెరపై రష్మి మ్యాజిక్ పని చేయలేదు. అక్కడ మితి మీరిన ఎక్స్ పోజింగ్, గ్లామర్ షో చేయడంతో రష్మి సక్సెస్ కాలేదు.

Rashmi Dance Performance In Akka Evare Athagadu
Rashmi Dance Performance In Akka Evare Athagadu

బుల్లితెరపై రష్మి చేసే గ్లామర్ షోకు ఫిదా కానివారెవ్వరూ ఉండరు. అయితే రష్మీ చీర కట్టినా, మోడ్రన్ డ్రెస్సు వేసినా జబర్దస్త్‌గానే ఉంటుంది. మొదట్లో యాంకరింగ్‌లో, డ్యాన్సులు వేయడంలో కాస్త తడబడిన రష్మీ రాను రాను రాటు దేలిపోయింది. యాంకరింగ్‌లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. ఢీ షో ద్వారా డ్యాన్సుల్లోనూ మెరుగుపడింది. తాజాగా రష్మీ చేసిన ఓ పర్ఫామెన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు.

దసరాకు అక్కా ఎవరే అతగాడు అనే ఓ స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారు. ఈ వేడుకలో సంగీత మెయిన్ లీడ్‌గా ఉంటోంది. అయితే ఈ ఈవెంట్‌లో సుధీర్, రష్మీ, శేఖర్ మాస్టర్, వర్షిణి ఇలా అందరూ దుమ్ములేపుతున్నారు. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రష్మీ రచ్చ రచ్చ చేసింది. రంగస్థలంలోని రంగమ్మ మంగమ్మ అనే పాటకు డ్యాన్స్ చేసి అందర్నీ ఫిదా చేసింది. సమంత చేసినట్టుగానే చేసి అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఇక చివర్లో సుధీర్‌తో చేసిన మూమెంట్ అదిరిపోయింది.

https://www.youtube.com/watch?v=mtGcSS2xIhE