రష్మీ సుధీర్ లేని స్పెషల్ ఈవెంట్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను ఎవ్వరూ ఊహించలేరు. మల్లెమాలలో ఏ స్పెషల్ ఈవెంట్ చేసినా సరే వీరిద్దరూ ఉండాల్సిందే. వీరి రొమాన్స్‌ను హైలెట్ చేయాల్సిందే. అలాంటిది ఎక్స్ ట్రా జబర్దస్త్ 300వ ఎపిసోడ్ అంటే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు మళ్లీ రష్మీ సుధీర్ రహస్య బంధాన్ని, వారి మధ్య ఉన్న కెమిస్ట్రీని వాడేసుకున్నారు.
రాకింగ్ రాకేష్ స్కిట్‌లోనూ రష్మీ సుధీర్ కాంబోనే వాడేశాడు. ఆయన లేనిదే ఈవిడ ఉండదు.. ఈవిడ లేనిదే ఆయన ఉండడు.. వీరిద్దరి మధ్య ఏమీ లేదని ప్రపంచానికి ఎప్పుడు తెలుస్తుందో అని పంచ్ వేశాడు. ఇక ప్రోమో చివర్లో రోజా వీరిద్దరి నిలబెట్టి ప్రశ్నించింది. మీ ఫ్యాన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు అని మీ ఇద్దిరికీ ఒకరిపై ఒకరికి ఉన్ని అభిప్రాయం ఏంటో చెప్పమని అడిగింది.
దీంతో సుధీర్ ఎమోషనల్ అయ్యాడు. ప్రతీ మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందంటారు.. కానీ ఈ ఎనిమిదేళ్లలో రష్మీ నా పక్కనే ఉంది.. సుధీర్ అంటే గుర్తు పడతారు.. కానీ సుధీర్ రష్మీ అంటే మాత్రం అందరూ గుర్తు పడతారు.. అని సుధీర్ చెప్పి టచ్ చేశాడు. ఇక చివరగా వీరిద్దరూ చేసిన రొమాంటిక్ పర్ఫామెన్స్ చూసి అందరూ ఫిదా అయ్యారు. ప్రోమోలోనే ఇలా ఉంటే పూర్తి ఎపిసోడ్ ఇంకెలా ఉంటుందో చూడాలి.