జానకి చదువు కోసం తాపత్రయ పడుతున్న రామ.. జానకిని రెచ్చగొట్టిన సునంద కొడుకు?

కుటుంబ కథ నేపథ్యంలో బుల్లి తెరపై ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్న జానకి కలగనలేదు సీరియల్ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందని విషయానికి వస్తే జ్ఞానంబ తన కుటుంబ సభ్యులందరితో కలిసి గుడిలో పూజ చేయిస్తూ ఉండగా సునంద జానకి ప్రెగ్నెంట్ కాదని దెప్పి పొడుస్తుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన జానకి త్వరలోనే మీరు కూడా ఈ శుభవార్తను వింటారులే అంటూ సునందన నోరూ మూయిస్తుంది.

జానకి అలా అనడంతో తాను చదువుకోనని ఇలా చదువుకు దూరమై కుటుంబ బాధ్యతలను చూసుకుంటానని నాకు అర్థం అయ్యేలా చెప్పడం కోసమే ఇలా మాట్లాడుతున్నారు కదా అంటూ రామ మనసులో అనుకుంటారు.జానకి ఇలా ప్రెగ్నెంట్ కావడం గురించి మాట్లాడటంతో మల్లికా టెన్షన్ పడుతూ నాకన్నా ముందుగా వారసుడిని కనీ ఆస్తి మొత్తం తానే లాక్కుంటుందేమోనని ఆందోళన చెందుతుంది. ఇలా అందరూ కలిసి పూజ పూర్తి చేయగా జానకి అందరికీ ప్రసాదం పెడుతూ ఉంటుంది.

అప్పుడే అక్కడికి పోలీస్ ఆఫీసర్ ఝాన్సీ తన కూతురితో గుడికి వచ్చి కూతురికి దేవుడిని నమస్కరించమని చెబుతుంది.ఝాన్సీ జ్ఞానాంబకు ఎదురుగా నిలబడటంతో పూజారి పోలీస్ ఆఫీసర్ ఝాన్సీ గురించి ఎంతో గొప్పగా చెబుతాడు.తప్పు చేస్తే తన వారైనా కానీ వదిలిపెట్టకూడదు వారికి శిక్ష పడాలనే తత్వం ఝాన్సీది అంటూ పోలీస్ ఆఫీసర్ గురించి చెప్పగా, అప్పుడే అక్కడికి జానకి కూడా వస్తుంది. చిన్నారిని చూసిన జ్ఞానంబ పాపతో ఇలా డ్యూటీ చేయడం ఇబ్బంది కాదా అంటూ అడగడమే కాకుండా పాపని చూసుకోవడానికి మీ అమ్మగారు ఉన్నారా అంటూ ప్రశ్నిస్తుంది.

తనకు తల్లి లేదని పాపను చూసుకుంటూనే ఉద్యోగం చేస్తున్నానని ఝాన్సీ చెప్పగా ఇదే అదునుగా భావించిన రామా ఇలా రెండు మ్యానేజ్ చేసుకోవడం కష్టమే కదా ఏదో ఒకదానిని వదులుకోవచ్చు కదా అంటారు.సమస్య వస్తే మన లక్ష్యాన్ని వదులుకోకూడదు ప్రాణం పోయినా సరే మన లక్ష్యాన్ని సాధించాలంటూ ఈమె ఎంతో ప్రోత్సాహకరంగా మాట్లాడుతుంది. అలాగే జానకి కూడా ఐపీఎస్ చదువుతుందని తెలుసుకొని తనకి ఆల్ ద బెస్ట్ చెబుతుంది.అక్కడినుంచి వెళ్లిన జానకి చెట్టుకి ముడుపు కడుతుండగా అక్కడికి సునంద కొడుకు వస్తాడు.

కన్నబాబు జానకిని పలకరించి నీలాంటి వాళ్ల వల్ల బయట దొంగలు దర్జాగా తిరుగుతున్నారు అంటూ అఖిల్ ని ఉద్దేశించి మాట్లాడుతారు. నీ మరిది మీద కేసు పెట్టి ఎక్కడ జైలుకు వెళ్తాడు అని కేసు వెనక్కి తీసుకున్నావ్. పోలీస్ కాకుండానే ఇలా పక్షపాతం చూపిస్తావ్ ఇక నువ్వు పోలీస్ ఐతే నేరాలు చేసుకోవడానికి లైసెన్స్ నీ చేతికిచ్చినట్టే అంటూ తనని రెచ్చగొట్టేలా మాట్లాడతారు.ఇలా కన్నబాబు అన్న మాటలకు జానకి బాధపడుతూ నేను తన ఐపీఎస్ ఆశయం వదులుకోవడం కరెక్టేనా అనే ఆలోచనలో పడుతుంది. ఇంతటితో ఈ సీరియల్ పూర్తి అవుతుంది.