జానకి కలగనలేదు సీరియల్ రోజు రోజుకు ఎంతోమంది ఆదరణ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలోని నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే అఖిల్ జాబ్ గురించి ఆలోచిస్తూ రామ దిగాలు పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే అఖిల్ ఇంటర్వ్యూలో పాల్గొని వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి దిగులుగా బయటకు వెళ్లడం రామాచాటుగా చూస్తాడు. దీంతో చరణ్ తో మాట్లాడాలని రామా లోపలికి వెళుతుండగా బయట సెక్యూరిటీ తనని అడ్డుకుంటారు. తాను చరణ్ ఫ్రెండ్ అని చెప్పినప్పటికీ సెక్యూరిటీ ఒప్పుకోరు.
ఇది చూసినటువంటి చరణ్ సెక్యూరిటీపై అరచి మనిషిని కాదు చూడాల్సింది మనసుని తను నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ రామని లోపలికి తీసుకు వెళ్తాడు.దీంతో రామ నువ్వు ఇంత డబ్బులు ఇంత పెద్ద హోదాలో ఉన్న మనిషివి మాత్రం మారలేదు అంటూ చరణ్ పై పొగడ్తలు కురిపిస్తాడు.ఇక అఖిల్ జాబ్ విషయం ఏమైంది అని అడగడంతో అఖిల్ జాబ్ కి సెలెక్ట్ అయ్యాడు ఏ జాబ్ ఇవ్వమంటావు అని చరణ్ అడగడంతో తను చదువుకు తగ్గట్టు జాబ్ ఇవ్వమని రామా అడుగుతాడు.దీంతో చరణ్ ఒక పెద్ద ప్రాబ్లం ఉందని తాను ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలంటే అర్జెంటుగా కోటి రూపాయలు కట్టాల్సి ఉంది ఇప్పటికే బీటెక్ చదివిన వారు ఐదు మంది సెలెక్ట్ అయ్యారు వారందరూ కూడా 20 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చరణ్ చెబుతాడు.
ఇది విన్నటువంటి రామ మరో మార్గం లేదా అని అడగగా వేరే మార్గం లేదని రేపటిలోగా 20 లక్షలు సమకూరిస్తే అఖిల్ జీవితాంతం హ్యాపీగా సెటిల్ అవుతారని చెప్పడంతో తన జీవితం సెటిల్ కావడమే నాకు ముఖ్యం నువ్వు మాత్రం ఆ జాబు అఖిల్ కే ఇవ్వు 20 లక్షలు సంగతి నేను చూస్తానని వెళ్తారు. ఇక జానకి వదిన జ్ఞానంభకు ఫోన్ చేసి జానకి తల్లిదండ్రుల ఆప్దికం ఉంది వాళ్ళని పంపించమని అడగడంతో జ్ఞానంభ సరేననీ చెబుతుంది. ఈ విషయం రామాకి చెప్పి బయలుదేరమని చెప్పగా రామా మాత్రం డబ్బులు గురించి ఆలోచిస్తూ ఉంటారు.
జానకి సైతం రామాకు ఫోన్ చేసి వదిన ఫోన్ చేసింది మనం వెళ్దాము అని అడగడంతో నాకు కాస్త పనుంది మీరు వెళ్ళండి అని జానకికి చెబుతాడు అంతలోపు నీలావతి మల్లిక దగ్గరకు వెళ్లి ఇప్పుడు చిన్న కోడలు రేపు మాపో బిడ్డను కంటుంది. జానకి కూడా బిడ్డను కంటుంది ఇక నీ పరిస్థితి ఏంటి అని మల్లికతో మాట్లాడుతుంది. దీంతో మల్లిక జెస్సి రిపోర్ట్స్ లో ఏదోఉంది తెలుసుకోవాలని ఆ రిపోర్ట్స్ కొట్టేశాను కానీ కనపడటం లేదు. ఇక జానకి ఐపీఎస్ కాకుండా ఆపడం తన లక్ష్యమని చెబుతుంది. మరోవైపు జ్ఞానాంభ గోవిందరాజులు కూడా అఖిల్ ఉద్యోగం గురించి మాట్లాడుతుంటారు. మరోవైపు రామ 20 లక్షల డబ్బు ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.