Charan: నాన్న దయచేసి నా సినిమాలో తల దూర్చొద్దు…. చిరంజీవికి చరణ్ షాకింగ్ కండిషన్?

Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ కావడం గమనార్హం.RRR లాంటి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. కానీ ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య గేమ్ చేంజర్ సినిమాలు డిజాస్టర్ కావడంతో రామ్ చరణ్ కు వెంటనే ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అవసరమని చెప్పాలి.

ఇలా ఈయనకు సరైన హిట్ లేకపోవడంతో తనపై కాస్త ఒత్తిడి కూడా ఎక్కువే ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో స్పోర్ట్స్ బాక్ డ్రాప్ లో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టాలని ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎంతో పకడ్బందీగా షూటింగ్ పనులను నిర్వహిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నారనే వార్తల కూడా హల్చల్ చేస్తున్నాయి.

ఇక ఈ సినిమా ద్వారా ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో చరణ్ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన తండ్రి చిరంజీవికి కూడా ఈయన కండిషన్లు పెట్టినట్టు సమాచారం. రామ్ చరణ్ సినిమాల విషయంలో చిరంజీవి జోక్యం ఎక్కువగా ఉంటుందని ఎన్నోసార్లు తెలియజేశారు అయితే రామ్ చరణ్ నటించిన ఆచార్య గేమ్ చేంజర్ సినిమాలు చిరంజీవి డైరెక్షన్లోనే షూటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. చిరంజీవి చెప్పినట్లే డైరెక్టర్లు వినటం వల్ల అలాంటి ఫలితం వచ్చిందని మెగా అభిమానులే ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయం గురించి కొరటాల శివ పరోక్షంగా కూడా ఎవడి పనిని వాడు చేసుకునిస్తే బాగుంటుంది అన్నట్టు మాట్లాడారు. దీంతో బుచ్చిబాబు సినిమా విషయంలో రామ్ చరణ్ తన తండ్రి జోక్యం ఉండకూడదని చిరంజీవికి చెప్పినట్టు తెలుస్తుంది.