RC 16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ ఏడాది మొదట్లోనే చేదు అనుభవం ఎదురైంది. ఈయన హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచిందని చెప్పాలి. ఇలా ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి తరుణంలోనే రామ్ చరణ్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్ తెలుస్తోంది.
గేమ్ చేంజర్ సినిమా నిరాశ పరిచిన తన తదుపరి చిత్రం పట్ల అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం RC 16 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులని జరుపుకుంటుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా పనిచేస్తున్నారు.
సాధారణంగా ఏఆర్ రెహమాన్ ఏ సినిమా పూజా కార్యక్రమాలకు రారు కానీ ఈ సినిమా పూజా కార్యక్రమాలలో పాల్గొని ఆయన ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఈ సినిమా కథ అద్భుతంగా ఉందని అందుకే తాను ఈ సినిమాకు కమిట్ అయ్యానని తెలిపారు. ఇక ఈ సినిమా కోసం కొన్ని ట్యూన్స్ కూడా రెహమాన్ అందించారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి రెహమాన్ తప్పుకున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.
రెహమాన్ వ్యక్తిగత కారణాలవల్ల ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రామ్ చరణ్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే రెహమాన్ గతంలో కూడా ఇలా ఎన్నో సినిమాలకు మధ్యలోనే బయటకు వచ్చేసారనే వాదన కూడా ఉంది తాజాగా చరణ్ సినిమా నుంచి కూడా ఈయన తప్పుకున్నారనే వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సింది. ఒకవేళ ఈయన తప్పుకుంటే ఆస్థానాన్ని దేవిశ్రీప్రసాద్ పూర్తి చేస్తారని తెలుస్తోంది.