ఢీ షోలో సిగ్గుపడుతూ లవ్ మ్యాటర్ బయట పెట్టిన ప్రదీప్… లవ్ స్టోరీ మామూలుగా లేదుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర మీద యాంకర్లుగా గుర్తింపు పొందిన మేల్ యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా గుర్తింపు పొందిన ప్రదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రదీప్ యాంకరింగ్ అంటే అక్కడ సందడి మొదలైనట్టే. అయితే ఇండస్ట్రీలో ఉన్న మేల్ యాంకర్స్ లో ప్రదీప్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఎన్నో ఏళ్లుగా ప్రదీప్ ప్రేమ, పెళ్లి వార్తలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ప్రదీప్ ఎక్కడ కనిపించినా చాలు అందరూ అతని పెళ్లి గురించే ప్రస్తావిస్తారు. దీంతో ప్రదీప్ ఏదో ఒకటి చెప్పి వారి నుండి తప్పించుకుంటూ ఉంటాడు.

ఇది ఎలా ఉండగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షోలో ప్రదీప్ యాంకర్ గా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈవారం ప్రసారం కాబోయే ఢీ షో కి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ఈ ఎపిసోడ్ లో లవ్ థీమ్ పేరుతో ప్రేమ పాటలకు అద్భుతంగా డాన్స్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లో ఆది, అఖిల్ తమ లవ్ స్టోరీల గురించి బయటపెట్టారు. ఈ క్రమంలో ప్రదీప్ కూడా సిగ్గుపడుతూ.. ఇది చాలా చాలా మెమోరబుల్ నాకు.. మోస్ట్ బ్యూటీఫుల్ డే.. ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు.. అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రదీప్ మాట్లాడే మాటలు వినిపించకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు. దీంతో ప్రదీప్ ఏం మాట్లాడాడో తెలుసుకోవాలని ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది.

అయితే ప్రదీప్ ఇలా చేయటం ఇది మొదటిసారి కాదు. దీంతో ఈ ప్రోమో చూసిన కొందరు మాత్రం ఎప్పటిలాగే రేటింగ్స్ కోసం ఇలాంటి పనులు చేయటం మల్లెమాల వారికి బాగా అలవాటు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రదీప్ తన ప్రేమ విషయం బయట పెడతారా లేదా అన్నది తెలియాలంటే ఈ వారం ప్రసారం కాబోయే ఢీ షో చూడాల్సింది. ఇక ఈ షోలో ఇప్పటిలాగే ఆది రెచ్చిపోయాడు. అది కూడా తన లవ్ స్టోరీ గురించి చెబుతూ సిగ్గు పడ్డాడు. అంతే కాకుండా ఐస్ క్యూబ్ మీద నిలబడితే నీకు ముద్దు ఇస్తా అని శ్రద్దాదాస్ అనటంతో ఆది రెచ్చిపోయాడు. దానిమీద కేక్ కావాలంటే ముందు ఒక సగం ముద్దు ఇవ్వు అంటూ.