సినిమా అన్నాక.. జయాపజయాలు మామూలే.! కానీ, చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతోందంటే, ఏ హీరో అయినా కాస్త ఆలోచించుకోవాలి.
కథానాయకుడు కేంద్రంగా సినీ పరిశ్రమ నడుస్తోందన్నది నిర్వివాదాంశమిప్పుడు. ఆ కథానాయకుడి మీదనే సినిమా మార్కెట్ జరుగుతోంది. 70 కోట్లపైన ‘ఏజెంట్’ సినిమా కోసం ఖర్చు చేశారు. చిన్న విషయం కాదు ఇది.
కానీ, సినిమా బొక్క బోర్లా పడింది. ‘ఏజెంట్’ డిజాస్టర్ వెనుక కారణమేంటి.? ముమ్మాటికీ అఖిల్ ‘కారకుడు’ అని ఇన్‌సైడ్ సోర్సెస్ చెబుతున్నాయి. మధ్యలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తప్పితే ఏ సినిమా కూడా వర్కవుట్ కాకపోవడానికి నిర్మాణంలో అఖిల్ ప్రదర్శించే అతి ఓ కారణమన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. ‘ఏజెంట్’ సినిమా విషయంలోనూ అదే జరిగిందట.
ఆఖరికి, నాగార్జున కూడా ఇన్వాల్వ్ అవ్వలేని స్థితి అఖిల్ సినిమాలకు వుంటోందిట.