బాలయ్య షోలో సందడి చేయనున్న ప్రభాస్ హీరోయిన్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 100కు పైగా సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. సుదీర్ఘకాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే బాలకృష్ణ ఇప్పుడు హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ అనే షో ఆహాలో ప్రసారమై మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ షోలో బాలకృష్ణ సెలబ్రిటీలను ఆహ్వానించి తనదైన శైలిలో వారికి ప్రశ్నలు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

అన్ స్టాపబుల్ సీజన్ 1లో ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సీజన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హాజరయ్యాడు. మొదటి సీజన్ కి మంచి ప్రేక్షకాదరణ లభించటంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా తొందర్లోనే ప్రారంభించనున్నారు. ఈ సీజన్ 2 లో కూడా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. సీజన్ 2 లో పాల్గొనే సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సీజన్లో మరొక స్టార్ హీరోయిన్ సందడి చేయబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు అందాల నటి అనుష్క. బాహుబలి సినిమా తర్వాత సినిమాలకు దూరమైన అనుష్క సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనిపించడం లేదు. చాలాకాలంగా మీడియా ముందు కనిపించని అనుష్క ఈ షోలో సందడి చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలైన తర్వాత అనుష్క గురించి అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.