లాస్యకు క్లాస్ పీకిన పరంధామయ్య…. తులసితో షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న సామ్రాట్!

బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరుగుతుందనే విషయానికి వస్తే…లాస్య ఇంట్లో వాళ్ళందరినీ తన బుట్టలో వేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే పరంధామయ్యకు టాబ్లెట్స్ వేసుకోమని చెప్పడంతో పరంధామయ్య ఆ టాబ్లెట్స్ వేసుకుంటే నా రోగం బాగయ్యేది ఏమో కానీ పరలోకానికి వెళ్తా అంటూ తనకు క్లాస్ పీకుతాడు. అవి ఇప్పుడు వేసుకునే టాబ్లెట్స్ కాదు రాత్రి వేసుకునేవి మమ్మల్ని కొద్దిరోజులు బతకనివ్వు నా మనవరాలు పెళ్లిచూడనివ్వు అంటూ చెబుతాడు.

ఈ క్రమంలోనే భాగ్య కుటుంబ సభ్యులకు గురించి లేనిపోనివి చెబుతూ లాస్యకు చెప్పాల్సినవన్నీ చెప్పి వెళ్లిపోతుంది.తులసక్క ఇక్కడ లేకపోయినా అందరు మనసులో ఆమె ఉంది చివరికి బావ మనసులో కూడా తులసక్కే ఉంది అంటూ మరోసారి చిచ్చు పెడుతుంది. మరోవైపు సామ్రాట్ ఒకరోజు మిడిల్ క్లాస్ వ్యక్తిగా బ్రతకడం కోసం తులసి తో కలిసి షాపింగ్ చేయడానికి వెళ్తారు.కష్టపడి బస్సు ఎక్కిన సామ్రాజ్ టికెట్ తీసుకోవడానికి ఏకంగా 2000 రూపాయల నోటు ఇవ్వడంతో కండక్టర్స్ నీకు ఒక్కడికేనా బస్సులో ఉన్న వారందరికీ నువ్వే టికెట్ కొంటున్నావా అంటూ చిల్లరి ఇవ్వమని అడుగుతారు.

చిల్లర లేదని చెప్పడంతో టికెట్ వెనుక రాసిస్తాడు. ఇక బస్సులో కొద్దిగా రెస్ట్ తగ్గడంతో కూర్చోడానికి సీటు దొరకడంతో తులసి సామ్రాట్ ఇద్దరు పక్కపక్కన కూర్చొని ఉంటారు.ఇలా బస్సులో ప్రయాణం చేస్తూ సామ్రాట్ ఎంతో సంతోషంగా ఉండగా అంతలోపు అక్కడికొక మహిళ వచ్చి మీకు చదువు రాదా అక్కడేం రాసిందో చూడండి ఇది లేడీస్ సీట్ అంటూ మరోసారి సామ్రాట్ ను లేచి నిలబెడుతుంది. సామ్రాట్ చివరికి తనకు సీట్ దొరకడంతో ఎంతో సంతోషపడతాడు.ఇక దిగాల్సిన స్టాప్ రావడంతో తులసి తనని డోర్ దగ్గరకు వెళ్లి దిగమని చెప్పి అలాగే చిల్లర తీసుకోమని చెబుతుంది.

ఇక షాపింగ్ కోసం వెళ్ళినటువంటి తులసి సామ్రాట్ అక్కడ తులసి చేసే బేరాలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. లాప్టాప్ బ్యాగు కొనాలని వెళ్లిన తులసికి ఆ వ్యక్తి 2000 రూపాయలు ఖరీదు చెప్పడంతో ఈమె 300 కి ఇస్తావా అని అడగ ఒక్కసారిగా సామ్రాట్ షాక్ అవుతాడు. ఇక ఆ బ్యాగ్ విషయంలో బేరాలు ఆడిన తులసి చివరికి ఆ బ్యాగును 500 రూపాయలకు సొంతం చేసుకుంటుంది. మొత్తానికి ఒకరోజు మిడిల్ క్లాస్ వ్యక్తిగా సామ్రాట్ తులసితో షాపింగ్ చేస్తూ సరదాగా గడుపుతూ ఉంటారు.