మొదటిసారి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసిన మా అధ్యక్షుడు మంచు విష్ణు!

మా అధ్యక్షుడిగా వెండితెర నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మంచు విష్ణు. అయితే ఈయన సినిమాలలో కన్నా ఎక్కువగా వివాదాల ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఒక హీరోగా ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడిన పెద్ద ఎత్తున నెటిజన్లు తనని ట్రోలింగ్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తన గురించి ట్రోల్ చేసే వారికి చర్యలు తప్పవంటూ ఈయన తనదైన స్టైల్ లో వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఇలా పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచే విష్ణు తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి డాన్స్ ఇండియా డాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీ తెలుగులో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో మంచు విష్ణుసందడి చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈయన నటించిన జిన్నా సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇక ఈయన ఈ కార్యక్రమంలోకి వచ్చే రాగానే కమెడియన్ రోహిణి విష్ణు వద్దకు వెళ్లి తనదైన శైలిలో ఫన్ క్రియేట్ చేశారు.

ఈ సందర్భంగా రోహిణి విష్ణు వద్దకు వెళ్లి సార్ నేను త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీ టెంట్ హౌస్ నుంచి అన్నీ రావాలి అంటూ అడిగారు. రోహిణి ఇలా అడిగేసరికి మంచు విష్ణు మాట్లాడుతూ టెంట్ హౌస్ లో పెళ్లి చేస్తే ఆగిపోతాయి అయినా నా కన్నా చాలా మంది అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు అంటూ పంచ్ వేశారు.అలాగే ఓ ఫర్ఫార్మెన్స్ అనంతరం చీర ప్రాముఖ్యత చెప్పమని అడగా నేను నా స్టైల్ లో చీర ప్రాముఖ్యత చెబితే సెన్సార్ ఒప్పుకోదు అంటూ మరోసారి పంచ్ వేశారు.మొత్తానికి చాలా కాలం తర్వాత మా అధ్యక్షుడు బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.