బిగ్ బాస్ కార్యక్రమానికి సల్మాన్ రెమ్యూనరేషన్ తగ్గించిన నిర్వాహకులు.. కారణం అదేనా?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సల్మాన్ ఖాన్ హీరోగా మాత్రమే కాకుండా బుల్లితెర మీద ప్రచారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో హిందీలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారమవుతోంది. హిందీలో ఇప్పటికే 15సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తొందరలోనే బిగ్ బాస్ 16 వ సీజన్ ప్రారంభం కానుంది.

ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో కూడా విడుదల అయింది. ఈ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవటంతో సీజన్ 16 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ బిగ్ బాస్ సీజన్ 16 కోసం సల్మాన్ ఖాన్ తన రెమ్యూనరేషన్ భారీగా తగ్గించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం గతంలో కరణ్ జోహార్ ఓటీటీ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ సమయంలో ప్రేక్షకుల నుండి సరైన ఆదరణ లభించలేదు. దాని ప్రభావం ఇటీవల ముగిసిన సీజన్ 15 మీద పడి నిర్మాతలకి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.

అందువల్ల బిగ్ బాస్ సీజన్ 16 కోసం స్పాన్సర్లు ముందుకు రాకపోవడంతో సల్మాన్ ఖాన్ కి రెమ్యూనరేషన్ భారీగా తగ్గించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 15 కోసం సల్మాన్ ఖాన్ దాదాపు రూ.350 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 16 కోసం తన రెమ్యూనరేషన్లో ఎంత తగ్గించుకున్నాడో తెలియాలంటే ఈ విషయంపై సల్మాన్ ఖాన్ స్పందించాల్సి ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 16 అక్టోబర్ 1 వ తేదీన ప్రారంభం కానుంది.