అనసూయ పై హద్దులు దాటిన నెటిజన్స్ ప్రశ్నలు.. దిమ్మతిరిగే సమధానం ఇచ్చిన అనసూయ..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనసూయ హాట్ టాపిక్ గా మారింది బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా గ్లామరస్ గా కనిపిస్తూ తన అందంతో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలో తన వయసు, అందం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే చాలు చెంప చెళ్లుమనేల సమధానం ఇస్తోంది. ఇటీవల లైగర్ సినిమా డిజాస్టర్ గురించి నెగిటివ్ గా పోస్ట్ షేర్ చేసిన అనసూయని ఇప్పుడు
నెటిజన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు.

తన వయసు గురించి మాట్లాడితేనే రెచ్చిపోయే అనసూయని ఆంటీ ఆంటీ అంటు తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ఎక్కడ చూసినా కూడా ఆంటీ అనే పదం కనిపిస్తోంది. అయితే తన గురించి ఏజ్ షేమింగ్ చేసిన వారిపై అనసూయ ఫుల్ ఫైర్ అవుతోంది. అలా తననూ ఆంటీ అని పిలిచినా వారి మీద కేసు పెడతానని నెటిజన్స్ ని బెదిరిస్తోంది. అయితే నెటిజన్స్ మాత్రం అనసూయ బెదిరింపులకు భయపడకుండా మరింత రెచ్చిపోయి అనసూయని ట్రోల్ చేస్తున్నారు. అనసూయ కూడా ఏ మాత్రం తగ్గకుండా తన గురించి నెగటివ్ గా కామెంట్ చేసిన వారందరికీ చాలా స్ట్రాంగ్ గా సమాధానం చెబుతోంది.

ఇక ఈ వివాదంలో కొంత మంది నెటిజన్లు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు అనసూయ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఒక నెటిజన్ మరింత రెచ్చిపోయి ” ఒక రోజుకి నీ రేట్ ఎంత? అదే షో ఆర్గనైజ్ చేయడానికి” అని డబుల్ మీనింగ్ వచ్చేలా ప్రశ్న వేసాడు. ఈ ప్రశ్నపై స్పందించిన అనసూయ కూడా చాలా కూల్ గా అదే స్థాయిలో సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో అనసూయ మీకు లోకువ కదా? నేనంటే.. ఇదే ప్రశ్న మీ చెల్లినో లేదా మీకు పెళ్లి అయితే మీ భార్యనో అడగండి.. ఒక్క రోజుకు రేటు ఎంత ? అని.. అదే ఆఫీస్‌లో.. అని అడిగితే మీరేం చెబుతారు? అని చెంప చెల్లుమనేలా రిప్లై ఇచ్చింది.