ఆంధ్రప్రదేశ్ గాజువాక ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఝాన్సీ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతుంది. ఝాన్సీ కండక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూనే రికార్డ్ డాన్సులు చేస్తూ డబ్బు సంపాదిస్తుంది. ఈ క్రమంలో ఈమె ప్రతి పని గుర్తించిన మల్లెమాలవారు ఇటీవల ఈమెకు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అవకాశం కల్పించారు. ఈ షోలో ఝాన్సీ పల్సర్ బైక్ పాటకు అదిరిపోయి స్టెప్పులు వేసి అందరిని బాగా ఆకట్టుకుంది. దీంతో ఝాన్సీ పాపులారిటీ రెండు తెలుగు రాష్ట్రాలకు పాకిపోయింది.
ఇలా తాను పాపులర్ అయ్యానని సంబరపడేలోపే ఝాన్సీకి అనుకోని కష్టం వచ్చి పడింది. ఝాన్సీ తన భర్త ప్రోత్సాహంతోనే పెళ్లి తర్వాత కూడా ఇలా రికార్డ్ డాన్సులు చేస్తూ ఉంది. దీంతో నెటిజన్స్ ఝాన్సీ భర్త మీద విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్ళాం సంపాదనతో తిని కూర్చుంటున్నావు అంటూ కొందరు విమర్శలు చేస్తుంటే.. వెనుక నుండి సపోర్ట్ చేస్తూ పెళ్ళాంతో రికార్డ్ డాన్స్ చేయిస్తున్నవా? అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఇద్దరు పిల్లల తల్లివి అయ్యిండి రికార్డు డాన్స్ చేయటానికి సిగ్గు లేదా అంటూ మరికొంతమంది నెటిజన్స్ ఝాన్సీ మీద మండిపడుతున్నారు.
అయితే తన భర్త గురించి వస్తున్న విమర్శల మీద ఝాన్సీ స్పందించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఝాన్సీ తన భర్త పై వస్తున్న విమర్శల గురించి స్పందిస్తూ… నా భర్త గురించి ఇలా దారుణంగా కామెంట్స్ చేస్తుంటే చచ్చిపోవలన్నంత బాధగా ఉందని ఝాన్సీ తన బాధ చెప్పుకొచ్చింది.ఇలా తన గురించి,తన భర్త గురించి చెడుగా కామెంట్స్ వస్తే నా భర్త నన్ను ఎలా బయటికి వెళ్ళనిస్తాడు. ఇన్నాళ్లు ఎంతో ప్రేమ, నమ్మకంగ ఉన్న వ్యక్తి గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తే ఆయన నా గురించి తప్పుగా అనుకుంటాడు. దీంతో మా కుటుంబం కూడా విచ్ఛిన్నం అవుతుంది. దయచేసి నా గురించి, నా భర్త గురించి తప్పుగా విమర్శలు చేయకండని ఝాన్సీ వేడుకుంటూ తన భాధ వెల్లడించింది.