బాలయ్య షోలో మంగళగిరి ఓటమిని ఒప్పుకున్న నారా లోకేష్.. ఏమన్నారంటే?

నందమూరి బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా హోస్ట్ గా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఈయన వ్యాఖ్యాతగా ప్రముఖ తెలుగు ఓటీటీ సమస్థ ఆహాలో ప్రసారమవుతున్నటువంటి ఆహా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం మొదటి సీజన్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో నిర్వాహకులు రెండవ సీజన్ కూడా ప్రారంభించారు. ఇప్పటికే ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ కూడా పూర్తి అయింది. ఈ సీజన్ టు 2 భాగంగా మొదటగా బాలకృష్ణ బావగారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ హాజరయ్యారు.

ఇకపోతే బాలకృష్ణ లోకేష్ ను ఈ సందర్భంగా ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు. ముఖ్యంగా వీరిమధ్య వ్యక్తిగత విషయాలు మాత్రమే కాకుండా రాజకీయ విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఇక నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలన్నింటిని చూసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఐటి మినిస్టర్ గా కూడా పనిచేశారు.2019 సార్వత్రిక ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.

ఇక ఎన్నికలలో భాగంగా లోకేష్ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలోనే మంగళగిరి ఓటమి గురించి బాలకృష్ణ తన అల్లుడిని ప్రశ్నించారు. ఈ విషయంపై లోకేష్ స్పందించి తాను ఓటమిని అంగీకరిస్తున్నానని వెల్లడించారు. ఇలా మంగళగిరిలో ఓటమి పాలు అవ్వడానికి గల కారణం తానేనని ఎక్కువగా ప్రజలతో తాను కలవలేకపోయానని, ప్రజలతో తాను సరిగా మాట్లాడని నేపథ్యంలోనే మంగళగిరిలో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఈ సందర్భంగా లోకేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.