వారిద్దరి మధ్య రగులుతోంది మొగలి పొద.. సీక్రెట్ రూమ్ లో షాకింగ్ కామెంట్స్ చేసిన గీతు!

బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ప్రస్తుతం ఆరవ సీజన్ ప్రసారమవుతుంది ఈ కార్యక్రమం ఇప్పటికే నాలుగు వారాలను పూర్తి చేసుకుని మొదటి రెండు వారాలు ఏదో నామమాత్రపుగా కంటెస్టెంట్లు తమ పెర్ఫార్మెన్స్ చేసినప్పటికీ నాగార్జున చివాట్లతో కంటెస్టెంట్లు ఎంతో పౌరుషంగా పెద్ద ఎత్తున పెర్ఫార్మెన్స్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇక ఐదవ వారంలో భాగంగా నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తికాగా ఈ నామినేషన్లలో నువ్వా నేనా అన్నట్టు కంటెస్టెంట్లు గొడవపడ్డారు.

ఇక నామినేషన్స్ అనంతరం బిగ్ బాస్ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ తో బిగ్ బాస్ ను మెప్పించాలని కోరుతాడు.ఇక కంటెస్టెంట్లు తమ పర్ఫామెన్స్ తో బిగ్ బాస్ ను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇకపోతే గీతూకు మాత్రం ఈసారి బిగ్ బాస్ భారీ ఆఫర్ ఇచ్చారు. తనని సీక్రెట్ రూమ్ కి రమ్మని చెప్పి తనకు చికెన్ ముక్కలు చూపించి చికెన్ ముక్కలు తనకు బిగ్ బాస్ హౌస్ లో ఒక గాసిప్ చెప్పమని అడుగుతారు. ఈ క్రమంలోనే బిగ్బాస్ ఇనయా సూర్య మధ్య రగులుతోంది మొగలిపొద అనిపిస్తుంది అనడంతో అయితే ఈ గాసిప్ తో నువ్వు చికెన్ వాసన చూడవచ్చు అంటూ తనకు కౌంటర్ ఇచ్చారు.

ఇక బిగ్ బాస్ ఇచ్చే కౌంటర్లకు గీతు పగలబడి నవ్వగా ఏంటో బిగ్ బాస్ ఇలా కామెడీ అయిపోయావు అని అన్నారు.అనంతరం ఈమె మరో గాసిప్ గురించి చెబుతూ బాలాదిత్య అన్న దీపు దీపు అంటా ఉంటే నాకు మండుతాంది బిగ్ బాస్ అని చెప్పగా ఇంత మంటగా ఉంటే నువ్వు చికెన్ ముక్కలు తినలేవులే గీతూ అంటూ మరోసారి కౌంటర్ ఇచ్చారు.అయితే ఆ చికెన్ ముక్కలు గీతూకి దక్కయ లేదా అనే విషయం తెలియాలంటే ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.