దసరా ఈవెంట్ కి వచ్చి అవమానపాలైన మంత్రి రోజా…?

సాధారణంగా పండగ వేళల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి బుల్లితెర పై అనేక ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంలో ఈటీవీ ఎప్పుడు ముందుంటుంది. దసరా పండుగ సందర్భంగా ఈటీవీ వారు దసరా వైభవం అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ మాజీ జడ్జ్ ఏపీ మంత్రి రోజా గారిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోజాకి జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ చాలా ఘనంగా స్వాగతం పలికారు.

ఇక ఈ షోలో యాంకర్ గా వ్యవహరించిన శ్రీముఖి మీద రోజా సెటైర్లు వేసింది. అలాగే ఎప్పుడు అందరి మీద పంచ్ లు వేసే హైపర్ ఆది మీద కూడా రోజా తనదైన శైలిలో పంచులు వేసింది. ఇక ఈ ఈవెంట్ లో అందరూ కామెడీ స్కిట్ లతో, అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో సందడి చేశారు. ఇక ఈవెంట్లో గెటప్ శ్రీను దశావతారం గెటప్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నాడు.

ప్రత్యేక కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన రోజా కార్యక్రమం మొత్తం సరదాగా గడిపింది. అయితే చివరికి మాత్రం రోజా జబర్దస్త్ ఆర్టిస్టుల మీద సీరియస్ అవుతూ నన్ను అవమానించడానికి ఇక్కడికి పిలిచారా? అంటూ చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే రోజా ఇలా ఎమోషనల్ అవ్వటానికి కారణం ఏంటో తెలియాలంటే మాత్రం ఈ ఈవెంట్ పూర్తిగా చూడాల్సిందే.