రష్మీ హాట్ ఎక్స్ప్రెషన్స్ కి పడిపోయిన మెగా హీరో.. రష్మీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వైష్ణవ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసత్వ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మెగా కుటుంబం నుండి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే వారిలో కొందరు మాత్రమే హీరోలుగా సక్సెస్ అయ్యారు. మెగా కుటుంబం నుండి హీరోలుగా వచ్చిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి వారు స్టార్ హీరోలుగా ఎదిగినప్పటికీ నాగబాబు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉండిపోయాడు. ఇక ఈ జనరేషన్ లో మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారిలో సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్ వంటి వారు కూడా హీరోలుగా మంచి గుర్తింపు పొందారు. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలు అడుగుపెట్టి మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో హీరోగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు.

ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయాయి. ఇటీవల విడుదలైన రంగ రంగ వైభవంగా సినిమాకి కూడా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇదిలా ఉండగా రంగ రంగ వైభవంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో బుల్లితెర యాంకర్ రష్మీ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో ” మీ సినిమాలో ఐటెం సాంగ్ చేయాలని అనుకుంటే.. ఏ హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకుంటారు.. ” అని యాంకర్స్ వైష్ణవ్ ని ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు వైష్ణవ్ తేజ్ స్పందిస్తూ… యాంకర్ రష్మీ అని టక్కున సమధానం చెప్పాడు. యాంకర్ రష్మి చూపించే హాట్ ఎక్స్ ప్రెషన్స్ వైష్ణవ్ తేజ్ ని బాగా ఆకట్టుకున్నాయట. అందువల్ల తన సినిమాలో ఐటమ్ సాంగ్ కి రష్మి అయితే బాగుంటుందని వైష్ణవ్ తేజ్ రష్మి పేరు చెప్పాడు. అయితే తన నెక్స్ట్ సినిమాలో ఐటమ్ సాంగ్ కి రష్మీ కి ఆఫర్ ఇస్తాడో లేదో చూడాలి మరి. ప్రస్తుతం రష్మి జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి మూడు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉండటం వల్ల సినిమాలకు పూర్తిగా దూరమైనట్లు కనిపిస్తోంది. అందువల్ల ఒకవేళ వైష్ణవ్ తేజ్ ఆఫర్ ఇస్తే రష్మీ అంగీకరిస్తుందేమో చెప్పలేము