బంగారం చెప్పనా అంటూ రచ్చ చేసిన మంజుల.. ఏకంగా పీక పట్టుకున్న డాక్టర్ బాబు!

బుల్లితెర శోభన్ బాబుగా గుర్తింపు పొందిన నిరూపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందిన నిరుపమ్ కార్తీకదీపం సీరియల్ ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. సోషల్ మీడియాలో సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నిరూపమ్ తన భార్య మంజులతో కలిసి వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

ఇలా ఇద్దరు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు తమ నటనకు సంబంధించిన విషయాలను కూడా వీడియోల ద్వారా తమ అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఈ యూట్యూబ్ వీడియోస్ లో నిరుపమ్ వేసే పంచులు ప్రాసలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల నిరుపమ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న బంగారం చెప్పనా అనే డీజే పాటకు నిరుపమ్ మంజుల కలసి వీడియో చేశారు.

ఈ వీడియోలో మంజుల బంగారం చెప్పనా..అంటూ నిరుపమ్ వెంటపడుతుంది. దీంతో విసిగిపోయిన నిరుపమ్ మంజుల పీక పట్టుకొని పక్కకి తోసేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న నిరుపమ్ కార్తీక దీపం సీరియల్ లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో నిరుపమ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.