తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటుడిగా సహాయ నటుడి పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సంపాదించుకున్నారు నటుడు సమీర్.ఈయన ఎన్నో సినిమాలలో హీరో ఫ్రెండ్ పాత్రలలోను హీరోయిన్ అన్నయ్య పాత్రలలోనూ నటించారు. అదేవిధంగా పలు సినిమాలలో విలన్ పాత్రలలో కూడా సందడి చేసిన సమీర్ తన కెరియర్ మొదటగా ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ప్రారంభమైంది.ఇలా సీరియల్ నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి సమీర్ ఉన్నఫలంగా ఈటీవీకి దూరమయ్యారు.
ఈటీవీలో ప్రసారమయ్యే నా మొగుడు నాకే సొంతం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈ సీరియల్ షూటింగ్ జరిగే సమయంలో లొకేషన్లోనే ఈయన హీరోయిన్ తో కలిసి రొమాన్స్ చేశారట. ఇలా హీరోయిన్ తో ఇలా ప్రవర్తించడం వల్లే సుమన్ నటుడు సమీర్ ను ఆ సీరియల్ నుంచి తప్పించడమే కాకుండా ఏకంగా ఈటీవీ నుంచి బ్యాన్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి కూడా సమీర్ ఓ సందర్భంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ కొందరికి గిట్టని వాళ్లు నా గురించి సుమన్ కి ఈ విధమైనటువంటి విషయాలు చెప్పారని తెలిపారు.తనపై ఎంతో నమ్మకం ఉన్నటువంటి సుమన్ అసలు ఏం జరిగిందని కూడా ఆలోచించకుండా తనని ఆ సీరియల్ నుంచి తప్పించారని అయితే తాను ఆ సీరియల్ నుంచి తప్పుకోవడమే తనకు చాలా మంచి జరిగిందని ఈ సీరియల్ నుంచి తప్పకున్న తర్వాత వరుస సినిమా అవకాశాలు తనని వెతుక్కుంటూ వచ్చాయని సమీర్ ఓ సందర్భంలో తెలియజేశారు.