పెళ్లి సమయంలో మహాలక్ష్మికి రవీందర్ ఎంత బంగారం చేయించాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

తమిళ నిర్మాత రవీందర్ అతని సతీమణి మహాలక్ష్మి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం వీరిద్దరూ ఏం చేసినా కూడా క్షణాలలో వైరల్ అవుతుంది. ఎందుకంటే భారీ ఖాయంతో ఉన్న రవీందర్ ని ఎంతో అందమైన మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడమే దీనికి కారణం. మనస్పర్ధలు కారణంగా ఇద్దరు తమ మొదటి వివాహాన్ని రద్దు చేసుకొని రెండవ పెళ్లికి సిద్ధపడ్డారు. ఇలా కొంతకాలం ప్రేమించుకున్న వీరిద్దరూ ఇటీవల వివాహ బంధంతో ఒక్కటే అయ్యారు.

ఇక వీరి వివాహం కోలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇటు టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా వీరి హనీమూన్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ ఏం చేసినా కూడా నెటిజన్స్ నుండి టోల్స్ ఎదుర్కొంటున్నారు. అయితే వీరిద్దరూ మాత్రం తమ గురించి వచ్చే విమర్శలను పట్టించుకోకుండా వారి జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా పెళ్లి సమయంలో రవీందర్ మహాలక్ష్మికి ఇచ్చిన కానుకలు బంగారం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం… మహాలక్ష్మికి ఒక బంగారు పూత పూసిన మంచాన్ని రవీందర్ కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పెళ్లి సమయంలో రవీందర్ మహాలక్ష్మి కోసం భారీగా ఖర్చు చేసి ఒకటిన్నర కిలోల బంగారు నగలు తయారు చేయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.